పవన్ కల్యాణ్‌ను అందుకే విమర్శించాను.. షూటింగ్‌లో ఎదురైనప్పుడు అదే మాట్లాడాను..: ప్రకాష్ రాజ్

ఇండియన్ టాప్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరైన ప్రకాష్ రాజ్ కేవలం నటుడిగానే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా నలుగురికి సహాయం చేస్తుంటారు. అధికార ప్రభుత్వం ఎలాంటి పొరపాటు చేసినా కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ పై ఆ మధ్య విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే వకీల్ సాబ్ షూటింగ్ లో ఆయన ఎదురైనప్పుడు ఎలా ఉండేది అనే విషయంపై కూడా వివరణ ఇచ్చారు.

వకీల్ సాబ్ లో..

వకీల్ సాబ్ లో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో ప్రత్యర్థి లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించాడు. సినిమాలో వీరి కలయికలో వచ్చిన సీన్స్ హైలెట్ అయ్యాయి.

అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

అయితే ఒకప్పుడు రాజకీయ కారణాల వల్ల ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ భారత జనతా పార్టీతో కలవడంపై ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. అంతకుముందు నుంచే మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రకాష్ రాజ్ జనసేన బీజేపీతో చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 నిలకడ లేని మనిషి అంటూ

నిలకడ లేని మనిషి అంటూ

పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషి అంటూ జనం అంచనాలను ఆశల్ని ఆయన నెరవేర్చలేకపోయాడని మాట్లాడారు. ప్రకాష్ రాజ్ ఆ విధంగా విమర్శలు చేయడంతో ఆయనపై ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోల్స్ కూడా నడిచాయి.

 షూటింగ్ లో ఎదురైనప్పుడు

షూటింగ్ లో ఎదురైనప్పుడు

ఐతే ఆ విమర్శల తర్వాత ఇద్దరు వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య వాతావరణం ఎలా ఉండేది అనే సందేహాలు ఎన్నో వచ్చాయి. అయితే ఇద్దరు కూడా షూటింగ్ లో రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాట్లాడుకోవడం లేదని చాలా కూల్ గా మాట్లాడుకుంటున్నట్లు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది.

స్పందించిన పవన్

స్పందించిన పవన్


ఇక ఇటీవల వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్, ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన చాలా మంచి నటుడు అంటూ అలాంటి నటుడు మనతో ఉండడం మన అదృష్టం అంటూ మాట్లాడారు. రాజకీయంగా విమర్శలు చేసిన్నప్పటికీ ఆయన వ్యక్తిగతంగా తనకు చాలా ఇష్టమని పవన్ వివరణ ఇచ్చాడు.

అందుకే విమర్శించాను

అందుకే విమర్శించాను

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ నేను ఎంతగానో ప్రేమిస్తాను. అందుకే విమర్శలు కూడా చేశాను. ఆయన నా అభిప్రాయాలను గౌరవించారని చెప్పిన విధానాన్ని నేను కూడా చూశాను. ఆయన గారు ఒక లీడర్. ఇష్టం కాబట్టే ఒక లీడర్ గా ఎలా ఉండాలో చెప్పాను. 'వకీల్ సాబ్' సెట్లో మా ఇద్దరి మధ్య మంచి విషయాలపై చర్చలు సాగేవి. కొన్ని పుస్తకాల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకొని తీసుకున్నట్లు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X