వెనక ఎవరున్నారనేది ముఖ్యమా? ఏడుపొస్తోంది: శ్రీరెడ్డి ఇష్యూపై ప్రకాష్ రాజ్ సంచలనం

By Bojja Kumar

Recommended Video

prakash raj sensational Comments On sri reddy

టాలీవుడ్లో సంచలనం రేపిన శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం ఇష్యూ అనేక మలుపులు తిరిగి చివరకు ఊహించని పరిణామాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి లేవనెత్తిన కాస్టింగ్ కౌచ్ ఇష్యూను పక్కదారి పట్టించారనే వాదన కూడా ఉంది. మరో వైపు తాను లేవనెత్తిన ఇండస్ట్రీలోని అతి ముఖ్యమైన సమస్యలకు సరైన పరిష్కారం దొరకలేదంటూ శ్రీరెడ్డి తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఇష్యూపై తాజాగా ప్రకాష్ రాజ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు. శ్రీరెడ్డికి మద్దతుగా ఆయన స్పందించారు. సమస్యను డైవర్ట్ చేయవద్దని సూచించారు.

ఒక ఆడది చెబుతుందంటే ఒకసారి వినాలి

ఒక ఆడది చెబుతుందంటే ఒకసారి వినాలి

శ్రీరెడ్డి ఇష్యూ మీద ప్రకాష్ రాజ్ స్పందిస్తూ... ‘ఒక ఆడది చెబుతుందంటే ఒకసారి వినాలి. నువ్వు ఎవరు మాట్లాడటానికి అనడం సరికాదు. తనకు అన్యాయం జరిగింది అని ఆమె ఏడుస్తుందంటే అది కరెక్టా? కాదా? అని వినండి. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో లేదా? ఉంది కదా....ఆమె లాంటి వారు ఇలా బయటకు రావడం వల్ల పరిస్థితులు మారే అవకాశం కూడా ఉంది.... అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

మగాడు ఉన్న అన్ని చోట్లా ఆడదాని మీద దౌర్జన్యం జరుగుతోంది

మగాడు ఉన్న అన్ని చోట్లా ఆడదాని మీద దౌర్జన్యం జరుగుతోంది

సినిమాలు మాత్రమే కాదు, అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మగాడు ఉన్న అన్ని చోట్లా ఆడదాని మీద దౌర్జన్యం జరుగుతోంది. దయచేసి ఎవరైనా ఇలాంటి సమస్య చెప్పుకుంటూ ఏడిస్తే వారి క్యారెక్టర్‌ను తప్పుబట్టడం లాంటివి దయచేసి చేయొద్దు... అని ప్రకాష్ రాజ్ అన్నారు.

చానల్స్‌ను ఇండస్ట్రీకి దూరం చేయడం సరికాదు

చానల్స్‌ను ఇండస్ట్రీకి దూరం చేయడం సరికాదు

శ్రీరెడ్డి చెప్పిన దాన్ని బాధ్యతా యుతంగా న్యూస్ ఛానల్స్ లో చూపించినందుకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ న్యూస్ ఛానల్స్ ను పూర్తిగా ఇండస్ట్రీకి దూరం చేయాలనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనిపై మీ స్పందన ఏమిటి అనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.... ఇది సరైంది కాదు అని బదులిచ్చారు.

ఎవరు చేశారు అనేది ముఖ్యమా? వాస్తవం ఏమిటనేది ముఖ్యమా?

ఎవరు చేశారు అనేది ముఖ్యమా? వాస్తవం ఏమిటనేది ముఖ్యమా?

ఫైనల్లీ శ్రీరెడ్డి ఇష్యూలో ఆమె చెప్పింది ఎవరూ వినడం లేదు. ఎలా వచ్చారు? ఎవరు చేశారు అనేది ముఖ్యమా? వాస్తవం ఏమిటనేది ముఖ్యమా? మన దేశంలో ఒక ఆడదాని విషయంలో ఏమైనా ఉండొచ్చు, నువ్వెవరు ఆమె క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి? అలా చేయడం కాదు... అంటూ శ్రీరెడ్డికి సపోర్టుగా ప్రకాష్ రాజ్ మాట్లాడారు.

మా ఆడ తల్లుల మీద దౌర్జన్యం చేయడం లేదా? ఏడుపొస్తోంది..

మా ఆడ తల్లుల మీద దౌర్జన్యం చేయడం లేదా? ఏడుపొస్తోంది..

‘‘మీరు శ్రీరెడ్డి ఇష్యూను డైవర్ట్ ఎందుకు చేస్తున్నారు? ఆమె మన సాటి మనిషి. ప్రశ్న ఎత్తింది కదా? ఆమె చెప్పినట్లు అలాంటి నీచాలు ఇక్కడ జరగట్లేదా? మగాళ్లందరూ చాలా అద్భుతంగా ఉన్నారా? మా ఆడ తల్లుల మీద దౌర్జన్యం చేయడం లేదా? ఏడుపొస్తోంది నాకు. అసహ్యాన్ని అసహ్యం అని ఒప్పుకోండి''... అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X