twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prakash Raj సంచలనం.. మా ఎన్నికల్లో ఏపీ రౌడీషీటర్లు.. ప్రూఫులతో సహా రిలీజ్!

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం సినీఫక్కీలో రోజుకో ట్విస్ట్ తెర మీదకు వస్తోంది. సాధారణ ఎన్నికల్లో రాజకీయ నాయకులు లాగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపించింది.. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత వ్యవహారం చల్లబడుతుంది అనుకుంటే ఇప్పుడు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం మీద ప్రకాష్ సంచలన ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    రాజీనామాల పర్వం

    రాజీనామాల పర్వం

    హోరా హోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే ఆయన ప్యానల్ నుంచి దాదాపు 11 మంది గెలిచి పదవులు అలంకరించారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన రెండో రోజే రాజీనామాల పర్వం కూడా మొదలైంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు ఆయనకు సపోర్ట్ చేసిన నాగబాబు అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవులకు రాజీనామా చేశారు. నాగ బాబు, ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

    సీసీ ఫుటేజీ ఇస్తే

    సీసీ ఫుటేజీ ఇస్తే

    తాను వాటిని ఆమోదించేది లేదు అని విష్ణు చెబుతున్నారు కానీ ప్రకాష్ రాజు మాత్రం ఎన్నికల రోజు సీసీ ఫుటేజ్ కావాలని ముందు నుంచి కోరుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో బయటి వ్యక్తులు వచ్చారని మోహన్ బాబు లాంటి వాళ్లు బెదిరించారని ప్రకాష్ రాజ్ బృందం ఆరోపిస్తోంది. బెనర్జీ, తనీష్ లాంటి వాళ్లు కన్నీళ్లు పెట్టుకుని సైతం ఇదే విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. దీంతో తమకు సీసీ ఫుటేజీ ఇస్తే దానిని పరిశీలించి అవసరమైతే కోర్టుకు వెళ్తానని ప్రకాష్ రాజ్ చెబుతున్నారు.

    ఆర్టిస్టులను భయపెట్టారు

    ఆర్టిస్టులను భయపెట్టారు

    అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రౌడీ షీటర్లు కొందరు ఓట్లు వేయడానికి వచ్చిన ఆర్టిస్టులను భయపెట్టారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన విషయాన్ని బయటపెట్టారు. రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు మా ఓటర్లను బెదిరించారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు.

    నూకల సాంబశివరావు రౌడీ షీటర్

    అంతేకాక ప్రకాష్ రాజ్ తన ఫిర్యాదులో కౌంటింగ్ హాల్ లో నూకల సాంబశివరావు అనే ఒక రౌడీ షీటర్ ఉన్నాడని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సాంబశివరావు మీద రౌడీషీట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఒక హత్య కేసులో, ముగ్గురు ఎస్సైలని కొట్టిన కేసులలో అతను నిందితుడుగా ఉన్నాడని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు.

     సీసీ ఫుటేజ్ ఇవ్వండి

    సీసీ ఫుటేజ్ ఇవ్వండి

    ఈ విషయం మీద 14వ తేదీన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. తాజాగా సదరు నూకల సాంబశివరావు ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకాష్ రాజ్ రిలీజ్ చేశారు. ''డియర్ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు ఇది బిగినింగ్ మాత్రమే మే, మాకు సీసీ ఫుటేజ్ ఇవ్వండి, అప్పుడు మేము ప్రపంచానికి ఎలక్షన్స్ ఎలా జరిగాయి అనే విషయాన్ని తెలియచేస్తామని అంటూ ట్వీట్ చేశారు

    Recommended Video

    Seeta Manohara Sriraghava Movie Opening Video
    స్పందించక తప్పదా?

    స్పందించక తప్పదా?

    అయితే ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ ఏమో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించడంతో తన పని అయిపోయిందని ఇక మీదట దీని విషయంలో తనకు ఎలాంటి బాధ్యత లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ నేరుగా ఫోటోలతో సహా ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఆయన స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. మరి ఆయన స్పందన ఎలా ఉంటుంది? అనే విషయం మీద ఆసక్తి నెలకొంది.

    English summary
    A new twist took place in MAA Elections, Prakash Raj complaining a rowdy sheeter was seen inside on the MAA election day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X