twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాష్‌రాజ్‌కు తప్పిన ప్రమాదం... గాయాలు

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ హైటెక్‌సిటీ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ప్రైవేటు బస్సు ఢీకొంది. ప్రకాష్‌రాజ్‌ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆయన కారు, దాని పక్కనున్న ఆటో పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆటోలోని ప్రయాణికులు రోడ్డుపై పడ్డారు. ప్రమాదం జరిగిన చోట యువకులు తీరు పట్ల ప్రకాష్‌రాజ్‌ అసహనం వ్యక్తం చేశారు.

    Prakash Raj

    ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న చిన్నారి అక్షయకు స్వల్ప గాయమైంది. అనంతరం ఆటోడ్రైవర్‌తోపాటు ప్రకాశ్‌రాజ్‌ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను కొంత సేపు షాక్‌కు గురయినట్టు ప్రకాశ్‌రాజ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు. ప్రమాదస్థలిలో కొందరు యువకులు స్పందించకుండా కేవలం ఫొటోలు తీసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తంచేస్తూ ట్వీట్ చేసారు.

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ''ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకొన్నాను. కాళ్లు చేతులకు చిన్న గాయాలయ్యాయి. అక్కడి యువత స్పందించిన తీరు మనసును బాధపెట్టింది. ఆటోలోని ప్రయాణికులు రోడ్డుపై పడ్డారు. వాళ్లను కాపాడాల్సిందిపోయి ఎవరికివాళ్లు సెల్‌ఫోన్లతో ఫొటోలు తీస్తూ కనిపించారు. నాకు ప్రమాదం జరిగిందన్న విషయం కంటే మానవత్వం లేకుండా ఫొటోలు తీస్తున్నవాళ్లను చూశాక ఎక్కువ భయమేసింది. సాంకేతికత ఎందుకు ఉపయోగపడుతోందో? మనం ఎక్కడికెళుతున్నామో అర్థం కావడం లేదు''అని అన్నారు.

    English summary
    Prakash Raj escaped from a major road accident just while ago. Prakash had a miraculous escape when a bus rammed into the vehicle of the actor from behind at a traffic signal near hi Tech city in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X