'ప్రకాష్ రాజ్' దర్శకత్వం
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడిగా మారనున్నారు. "అభియుమ్ నానుమ్" పేరుతో తమిళంలో రూపొందిన చిత్రాన్ని కన్నడలో రీ-మేక్ చెయ్యనున్నారు. ఈ రీ-మేక్ కు ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా తెలుగులో "ఆకాశమంత" పేరుతో అనువాదమయింది. కన్నడలో అనువాదం నిషిద్ధం కనుక రీ-మేక్ చెయ్యనున్నారు.
తొలుత ఈ రీ-మేక్ లో కూడా త్రిషనే కథానాయికగా తీసుకుందామని ప్రకాష్ రాజ్ భావించారట. అయితే ఆ పాత్రపై ప్రేమ చూపడానికి బదులు పారితోషికానికే త్రిష ప్రాధాన్యం ఇవ్వడంతో ఆమె బదులు రమ్యను తీసుకున్నారట. స్వతహాగా కన్నడిగ అయిన ప్రకాష్ రాజ్ నటుడిగా ఇతర భాషల్లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ, తన మాతృభాష ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
prakash raj director aakasamantha trisha ramya dil raju kannadiga abhiyum naanum ప్రకాష్ రాజ్ దర్శకుడు ఆకాశమంత త్రిష రమ్య దిల్ రాజు కన్నడిగ అభియుమ్ నానుమ్


Click it and Unblock the Notifications