నటనకే ఓనామాలు నేర్పగల నేర్పరి

By Staff

నటనకే ఓనామాలు నేర్పగల నేర్పరి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్ర తప్ప ఆయన కనిపించడు. మీ సినిమాలో ప్రకాష్ రాజ్ వున్నాడా అని బయ్యర్లు అడిగి మరీ సినిమాను కొంటున్నారంటే ఆయన స్టామినా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 1965లో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించిన ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్. ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆయన పేరును ప్రకాష్ రాజ్ గా మార్చారు. నాటి నుండీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు.

తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తమిళంలో శైలేంద్ర సింగ్ నిర్మించిన "కాంచీవరం" చిత్రంలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పోటీపడి వారిని తోసిరాజని ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇంతకు ముందు తమిళ చిత్రం ఇరువర్(ఇద్దరు) చిత్రంలోని నటనకుగాను జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డున గెలుచుకున్న ప్రకాష్ రాజ్ మరిన్ని విలక్షణ పాత్రలు పోషిస్తూ మరిన్ని పురస్కారాలు పొందాలని దట్స్ తెలుగు తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X