ప్రకాష్ రాజ్ కూతురుగా నయనతార
నయనతార తల్లిదండ్రులుగా మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ 'ఎలక్ట్రా' అనే చిత్రంలో నటిస్తున్నారు. మంగళవారం అలెప్పీలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. ఇందులో నయనతార టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. నయనతార, ఆర్య జంటగా తమిళంలో 'బాస్ ఎన్‌గిర భాస్కరన్' అనే చిత్రం రూపొందుతోంది. 'ఎలక్ట్రా'తో మరోసారి ఈ కాంబినేషన్ కలుస్తోంది. జాతీయ అవార్డ్ గ్రహీత శ్యాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార మేకప్ లేకుండా నటిస్తోంది.
ఈ పాత్ర గురించి చెబుతూ - "ఎలక్ట్రా కోసం నన్ను నేను పూర్తిగా మార్చేసుకున్నా. ఇప్పటివరకు నేను నటించినవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. పెద్ద సినిమాల్లో నటించినప్పుడు పారితోషికం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ చిన్న బడ్జెట్ చిత్రాల్లో చేసినప్పుడు నటనకు స్కోప్ ఉంటుంది. వరుసగా ఇలాంటి సినిమాలే కాకపోయినా అడపా దడపా ఇలాంటివి చేయడంవల్ల ప్రతిభ వెలికి వస్తుంది. ఆ కారణంతోనే 'ఎలక్ట్రా' సినిమాని అంగీకరించాను. నటిగా నా సత్తా నిరూపించే చిత్రం ఇది' అంటోంది నయనతార. మలయాళంలో రూపొందిన 'ఎలక్ట్రా' చిత్రం ఆఫ్‌బీట్ ఫిలిం. ఇక ఇదే దర్శకుడు రూపొందించిన న్యూ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. దీనిని తెలుగులో మహేష్, వెంకట్ రచన చేసారు. 'ఎలక్ట్రా' కూడా వీరే చేయనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











