శివుడుగా ప్రకాష్ రాజ్ అదరకొడతాడు
తన కెరీర్ లో హీరోగా,విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఓ పౌరాణిక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న ఢమురుకం చిత్రంలో ఆయన శివుడుగా అలరించనున్నారు. ఆయన పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. ఇప్పటివరకూ సినిమాల్లో కనిపించే శివుడు పాత్రలకు భిన్నంగా గెటప్,డైలాగ్ డెలవరీతో ఈ పాత్ర సరికొత్తగా ఉంటుందంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగ అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











