twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడిని కొట్టారు, సెట్స్ తగలబెట్టారు, ఎవరిది బాధ్యత?... ప్రకాష్ రాజ్

    నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో సినిమా రంగంపై జరుగుతున్న దాడుల గురించి ప్రశ్నించారు.

    By Bojja Kumar
    |

    ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ యాష్ టాగ్‌తో దేశంలో చోటు చేసుకుంటున్న కొన్ని అవాంఛనీయ సంఘటనల గురించి ట్విట్టర్లో ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కొన్ని దారుణమైన సంఘటనలను ఆయన వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. సినిమా రంగంపై జరుగుతున్న దాడుల గురించి ప్రశ్నించారు.

    సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పద్మావతి' సినిమా సెట్స్ మీద ఆ మధ్య దాడి జరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడిపై చేయి చేసుకోవడంతో పాటు సెట్స్ తగలబెట్టారు. ఇటీవల మెర్సల్ సినిమా సెన్సార్ విషయంలో చాలా గొడవలు జరిగాయి. ఈ అంశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

    దర్శకుడిపై దాడి చేశారు, సెట్స్ తగలబెట్టారు

    దర్శకుడిపై దాడి చేశారు, సెట్స్ తగలబెట్టారు

    ‘వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం ఒకరి ఊహగానాలతో సినిమా సెట్స్ మీద దాడి చేస్తారు. దర్శకుడిపై చేయి చేసుకుంటారు. సెట్స్‌కు నిప్పంటిస్తారు. మరి ఇలాంటి వాటిని మీరు ఏమని పిలుస్తారు? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? అంటూ ప్రకాష్ రాజ్ నేరుగా ప్రశ్నించారు.

    ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరు?

    ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరు?

    ఒక చిత్రాన్ని సెన్సార్‌ చేయడానికి మీకు మీరే ఓ కమిటీ ఏర్పాటు చేసుకుంటారు. సినిమా విడుదలను బెదిరించి, దాన్ని ఆపేస్తారు. ఇలాంటి పనుల్ని ఏమంటారు?.. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించినందుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు? అంటూ ప్రకాష్ రాజ్ మెర్సల్ వివాదాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.

    భవిష్యత్ కోసం, బలమైన సమాజం కోసం ప్రశ్నిస్తున్నా

    భవిష్యత్ కోసం, బలమైన సమాజం కోసం ప్రశ్నిస్తున్నా

    భవిష్యత్ కోసం, బలమైన సమాజం కోసం నేను ఈ విషయాల గురించి ప్రశ్నిస్తున్నాను. ఈ పరిణామాలకు ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు, మరి ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ పరిస్థితి ఏమిటి? భవిష్యత్ కోసం, బలమైన సమాజం కోసం పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది అని ప్రకాష్ రాజ్ చెప్పే ప్రయత్నం చేశారు.

    ప్రకాష్ రాజ్ ఇపుడు ప్రశ్నించడాని కారణం వీరి వ్యాఖ్యలే

    ప్రకాష్ రాజ్ ఇపుడు ప్రశ్నించడాని కారణం వీరి వ్యాఖ్యలే

    ‘పద్మావతి' చిత్రంపై కేంద్ర మంత్రి ఉమా భారతి, మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ శనివారం మాట్లాడారు. ఉమా భారతి ఈ చిత్ర నిర్మాతలకు వ్యతిరేకంగా ఓ లేఖను విడుదల చేశారు. ఆర్టిస్టులకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, కానీ వారు వాస్తవాల్ని వక్రీకరించకూడదని ఆమె పేర్కొన్నారు. గిరిరాజ్‌ మాట్లాడుతూ.. ‘మరో మతం వారిపై సినిమాలు తీసి, వారిపై వ్యాఖ్యలు చేసేంత ధైర్యం సంజయ్‌లీలా భన్సాలీకి, ఇంకెవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పై విధంగా స్పందించారు.

    పద్మావతి సినిమాకు మద్దతుగా ప్రకాష్ రాజ్

    పద్మావతి సినిమాకు మద్దతుగా ప్రకాష్ రాజ్

    తాజాగా ట్వీట్ చేయడం ద్వారా ప్రకాష్ రాజ్ ‘పద్మావతి' సినిమాకు తన మద్దతు ప్రకటించారు. ‘పద్మావతి' సినిమా రాణి పద్మిణి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే రాణి పద్మిణి చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని హిందూ సంఘాలు దర్శకుడి మీద, సెట్స్ మీద దాడి చేసిన సంగతి తెలిసిందే. సినిమా చూడకుండా, కథ తెలియకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం, దాడి చేయడం సరికాదని, తాము చరిత్రను వక్రీకరించలేదని చిత్ర బృందం అప్పట్లోనే వివరణ ఇచ్చింది. ‘పద్మావతి' మూవీ డిసెంబర్ 1న విడుదల కాబోతోంది.

    English summary
    "In the note, he wrote, “To whomsoever it may concern. On the pretext on ones own specualtions. You are free to attack a film set and slap a filmmaker… burn down the sets… form your own committee to censor the film… threaten the release and stop it…What do you call such intentions…Who is responsible for creating such atmosphere." Prakash Raj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X