కారణం అ ఐదుగురు దర్శకులే: ప్రకాష్ రాజ్
నేనిక్కడ ఈ స్థాయిలో నిలబడడానికి కారణం అయిదు మంది దర్శకులు. వాళ్లే... కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, గుణశేఖర్, వి.వి.వినాయక్. దర్శకులుగా ఎదుగుతున్న సమయంలో ఆకలితో ఉన్న వాళ్లకు నేను దొరికాను. వాళ్లకు నా జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు ప్రకాష్ రాజ్. షారన్ ఇన్‌కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 'సెల్యూట్ టు మోనార్క్' పేరుతో ప్రకాష్‌రాజ్‌ని సన్మానించారు. దాసరి నారాయణరావు, నాగబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రకాష్‌రాజ్‌ని గజమాల, దుశ్శాలువాతో సత్కరించారు. సిద్ధార్థ్, సునీల్ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఇలా స్పందించారు. అలాగే నా ఒక్కడి ప్రతిభవల్ల ఈ ప్రకాష్‌రాజ్ పుట్టలేదు. నా జీవితం, పుస్తకాలు, రచయితలు, దర్శకులు ఇలా ఎంతోమంది నా వెనక ఉన్నారు. నటుడు అనేవాడు అందమైన బొమ్మలో ఒక రంగు మాత్రమే. మా ఇంట్లో ఎవ్వరూ నటులు లేరు.
అయితే మా నాన్నలా మధ్యతరగతి జీవితం వద్దనుకున్నా. ఇంకేదో కావాలనుకొన్నాను. ఏం కావాలో తెలియక ఇలా నటుడినయ్యాను. నా నటన గురించీ, నేను చేసిన సినిమాల గురించి మాట్లాడుతున్నారు. నాకు గమ్యం మాత్రమే కనిపిస్తుంది. దిగంతాలకేసి చూడడం అలవాటు లేదు. ఈ క్షణం, రేపు ఏమవుతానో నాకే తెలియదు. కానీ ఏం కాకూడదో తెలుసు అన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, నాగబాబు, చంద్రమోహన్, సునీల్, మంజుభార్గవి, పోకూరి బాబూరావు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, సాగర్, శివారెడ్డి, ద్వారకేష్, డి.వి.రమణ, వసుధా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











