మూడవసారి మహేష్‌కు తండ్రిగా.. సెంటిమెంట్ వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే!
సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో షురూ అయింది. ఈ చిత్రానికి సంబందించి విశేషాలు అభిమానులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. డెహ్రాడూన్ లో ప్రస్తుతం కాలేజీ నేపథ్యంలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఎక్కువ భాగం ఈ చిత్ర షూటింగ్ యుఎస్ లో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరికొత్త లుక్ లో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.

రెండేళ్ల పాటు
దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ కోసం రెండేళ్ల పాటు ఎదురుచూశాడు. ఊపిరి చిత్రం తరువాత వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

మహేష్ కు తండ్రిగా
మహేష్ బాబుకు ఈ చిత్రంలో తండ్రిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. మహేష్ కు తండ్రిగా నటించడం ప్రకాష్ రాజ్ కు ఇది మూడవసారి. గతంలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాల్లో ప్రకాష్ రాజ్ మహేష్ కు తండ్రిగా నటించాడు.

హిట్ సెంటిమెంట్
దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రంలో కూడా ఆ సెంటిమెంట్ పనిచేస్తే మహేష్ 25 వ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్
డీజే చిత్రంతో యువతని తనవైపు తిప్పుకున్న పూజా హెగ్డే కెరీర్ పరంగా మంచి జోరుమీద ఉంది. మహేష్ సరసన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











