ప్రకాష్ రాజ్ తో భూమిక 'కొత్త బంధం' మ్యాటర్
ప్రకాష్ రాజ్, భూమిక కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి కొత్త బంధం అనే టైటిల్ పెట్టటానికి నిర్ణయించుకున్నారని సమాచారం. అమోద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి ప్రయత్నంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దంపతుల మధ్య ఉండాల్సిన అవగాహన, ఆలోచనలు సవ్యదిశలో ఉంటే సంసారం ఎలా ఉంటుంది? అపసవ్యదిశలో ఉంటే ఎలా ఉంటుందో కథానుగుణంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు దర్శకుడు కృపాకరరెడ్డి చెప్తున్నారు.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కలెక్టర్ గా కనిపించనున్నారు. ఆయన బార్యగా అతన్ని మార్చుకునే పాత్రలో భూమిక కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ కాంచీవరం చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ఇదే కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.ఇంతకు ముందు ఒక్కడు చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ గానూ భూమిక హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.
ప్రకాష్ రాజ్ భూమిక కృపాకర్ రెడ్డి నేషనల్ అవార్డు కాంచీవరం కొత్త బంధం prakash raj bhumika krupakar reddy national award kanjeevaram kotha bandham


Click it and Unblock the Notifications