For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు విష్ణుతో సమస్య లేదు…మొత్తం సమస్య అతని వల్లే.. ప్రకాష్ రాజ్ కొత్త ట్విస్ట్!

  |

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోలింగ్ వ్యవహారంలో ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలింగ్ జరిగిన సమయంలో అలాగే కౌంటింగ్ జరిగిన సమయంలో కూడా అవకతవకలు జరిగాయని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తూ తమకు పోలింగ్ జరిగిన రోజుకు సంబంధించిన సి సి ఫుటేజ్ ఇప్పించాలని కోరారు. ముందు నిబంధనల ప్రకారం కోరితే సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించిన ఎన్నికల అధికారి ఆ తర్వాత మాత్రం ప్రకాష్ రాజ్ కి ఇవ్వడం కుదరదు అని పేర్కొనడం సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  అనుమానాలు ఉన్నాయి

  అనుమానాలు ఉన్నాయి

  ఎన్నికలు జరిగిన సమయంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేసుకునేందుకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి వచ్చానని ప్రకాష్ రాజు మీడియాతో పేర్కొన్నారు. మా ఎన్నికలు ఎలా జరిగాయి అనే విషయం మీద అనుమానాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన ఎన్నికల సమయంలో ఉద్రిక్తత నెలకొందని వాటిని చూపించాలని కోరారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నుంచి రిప్లై రావడం లేదని , మంచు విష్ణు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారని ఆయన కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోమని అంటున్నారు కానీ ఎన్నికల అధికారి మాత్రం కోర్టుకు వెళ్లండి అంటూ తిరుగుతున్నారు అని చెప్పుకొచ్చారు.

  జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్

  జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్

  నాకు విష్ణుతో ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, ఇప్పుడు అసలు సమస్య ఎన్నికల అధికారి తోనే వచ్చిందని ఆయన అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జరిగింది జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో కాబట్టి అక్కడి సిసి టివి ఫుటేజ్ పరిశీలించేందుకు ప్రకాష్ సభ్యులు శ్రీకాంత్ శ్రీధర్ రావు లతో కలిసి చేరుకున్నారు.

   నిబంధనలకు విరుద్ధం

  నిబంధనలకు విరుద్ధం

  అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి వెళ్లిన సంగతి తనకు తెలియదని ఆ విషయం మీద నాకు సమాచారం లేదని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అంటున్నారు. ఎన్నికల నిర్వహణ తో నా బాధ్యత తీరిపోయిందని ఆయన అంటున్నారు. అంతేగాక కేవలం ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మాత్రమే సీసీటీవీ ఫుటేజీ ఇవ్వడం అనేది నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు.

  జూబిలీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి పోలీసులు

  జూబిలీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి పోలీసులు

  తాజా సమాచారం మేరకు ప్రస్తుతానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి పోలీసులు చేరుకున్నారు. పబ్లిక్ స్కూల్ కి వచ్చిన ప్రకాష్ రాజ్ ఫోన్ చేయడం తోనే పోలీసులు అక్కడికి వచ్చారని తెలుస్తోంది. పోలీసులు రెండు ఫైనల్స్ కు సంబంధించిన సభ్యుల సమక్షంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరోపక్క మంచు విష్ణు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు.

  Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
  మాకేం ఇబ్బంది లేదన్న విష్ణు

  మాకేం ఇబ్బంది లేదన్న విష్ణు

  మంచు విష్ణు మాట్లాడుతూ ఆన్లైన్ టికెట్లు సమర్దిస్తున్నానని, మమ్మల్ని నిలదీసే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుందని ఆయన అడిగినా చూపిస్తానని అన్నారు. నాకు రాజకీయాలపై జీరో నాలెడ్జ్ అని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్, ఆయన సపోర్ట్ కావాలి. ఇది మన తల్లి జాగ్రత్తగా చూసుకో విష్ణు అని నిన్న నాకు పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు.

  మా నాన్న కోపం అందరికీ తెలుసు... పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత మాపై దాడి చేశారు అని వాళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉందని విష్ణు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ లను వాళ్ళు చూసుకోవచ్చు.... నో ప్రాబ్లం, ఇబ్బంది లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ అందరికీ పంచుకోండి అని ఆయన చెప్పుకొచ్చారు. మా వల్ల జూబ్లీ పబ్లిక్ స్కూల్ కు ఇబ్బంది కలిగింది...వారికి క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు.

  English summary
  prakash raj made serious comments on MAA Election officer krishna mohan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X