twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు ఆ వేధింపులు.. తట్టుకొని నిలబట్టా.. పసివాడు బలైపోయాడు.. సుశాంత్ మరణంపై ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్

    |

    సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. ఎన్నో ప్రశ్నలకు దారి తీస్తోంది. ఎవరి ఆంతరింగాల్లోకి వారు వెళ్లి ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకునేలా చేస్తోంది. ప్రపంచానికి సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్యే కావచ్చు గానీ నైతికంగా చూస్తే అది అందరూ కలిసి చేసిన హత్య. సుశాంత్ ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చిన క్షణం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఖాన్, కపూర్ ఫ్యామిలీ ఆధిపత్యాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ చేసిన హత్యగానే అందరూ వేలెత్తి చూపిస్తున్నారు.

    కరణ్ జోహర్‌పై ట్రోలింగ్..

    కరణ్ జోహర్‌పై ట్రోలింగ్..

    సుశాంత్ మరణ వార్త ఓ వైపు ట్రెండ్ అవుతుంటే.. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, అలియా భట్ వంటివారిపై నెటిజన్స్ విరుచుకపడటం వైరల్ అవుతూ వచ్చింది. అందరూ కలిసి సుశాంత్‌ను ఏకాకి చేశారని, కావాలని సినిమా ఛాన్స్‌లు ఇవ్వలేదని, బాలీవుడ్ నిర్మాణ సంస్థలన్నీ సుశాంత్‌ను వెలివేశాయని అందుకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

    నెపోటిజంపై చర్చ..

    నెపోటిజంపై చర్చ..

    సుశాంత్ మరణం తరువాత సోషల్ మీడియలో ఎక్కువగా నెపోటిజంపై చర్చిస్తున్నారు. కంగనా ఎప్పటి నుంచో బంధుప్రీతి, బాలీవుడ్ మాఫియా గురించి గళం ఎత్తుతూనే ఉంటుంది. గత రెండు రోజుల నుంచి కంగనా చేసిన వ్యాఖ్యలు, గతంలో మాట్లాడిని వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌కు ఎదురు నిలబడిన కంగనా ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

    వివేక్ ఒబేరాయ్ సైతం..

    వివేక్ ఒబేరాయ్ సైతం..

    వివేక్ ఒబేరాయ్ సైతం స్పందిస్తూ.. ఇకనైనా అందరూ మేల్కోవాలని ప్రతిభను ఆదరించాలని కోరాడు. ఇకపై బిచ్చింగ్ చేయడం ఆపాలని, అందరి పట్ల జాగ్రత్త వ్యవహరించాలని పేర్కొన్నాడు. టాలెంట్‌ను తొక్కేయకండి.. ఇక్కడ ప్రతిభ అనేది చిగురించాలని అన్నాడు. సుశాంత్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం వివేక్ చేసిన ఈ వ్యాఖ్యలు అందర్నీ కంటతడి పెట్టించాయి.

    Recommended Video

    Actor Shivaji Raja Hospitalised with Heart $troke
    ప్రశ్నించిన ప్రకాష్ రాజ్..

    ప్రశ్నించిన ప్రకాష్ రాజ్..

    నెపోటిజంపై సుశాంత్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ కొన్ని ప్రశ్నలను సంధించాడు. ‘నెపోటిజంలోనే నేను జీవించాను.. వాటిని తట్టుకుని బతికాను.. ఎన్నో దెబ్బలు కూడా తగిలాయి.. కానీ ఈ పసివాడు సుశాంత్ మాత్రం తట్టుకోలేకపోయాడు... మనం నేర్చుకోగలమా?.. అలాంటి కలలు కూలిపోకుండా మనం అండగా నిలబడగలమా?' అని ట్వీట్ చేశాడు.

    English summary
    Prakash Raj Comments On Nepotism And Sushant Suicide. He says that I have lived through this .. I have survived ... my wounds are deeper than my flesh ..but this child #SushanthSinghRajput couldn’t.. will WE learn .. will WE really stand up and not let such dreams die ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X