ప్రకాష్ రాజ్ వివాదంపై ఎమర్జెన్సీ మీటింగ్

By Srikanya

హైదరాబాద్: ప్రకాష్ రాజ్ కి ఆగడు టీమ్ కు చెందిన వివాదం గురించి తెలిసిందే. ఈ వివాద పరిష్కారానికై ఈ రోజు డైరక్టర్స్ అశోశియేషన్ వారు సమావేశమవుతున్నారు. ఈ మేరకు డైరక్టర్స్ అశోశియేషన్ సభ్యులందరికీ నిన్న(22,ఏప్రియల్)న మెసేజులు పంపారు. ఆ మెసేజ్ లలో ప్రకాష్ రాజ్ వాడిన అనైతిక, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వల్ల ఏర్పడిన అనారోగ్య వాతావరణం పై ప్రొడ్యూసర్స్ కౌన్స్ ల్ డిస్కస్ చేయటం జరుగుతుందని, అందరినీ హాజరు కావాలని తెలిపారు.

ఆగడు చిత్రానికి చెందిన కో డైరక్టర్...ఇచ్చిన కంప్లైంట్ తో ఈ వివాదం బయిటకు సమాచారం. ప్రకాష్ రాజ్ కి ఆ కో డైరక్టర్ ...గుడ్ మార్నింగ్ చెప్పి విష్ చేస్తే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడారని అదే ఈ సమస్యను పెద్దది అయినట్లు తెలుస్తోంది.

సినీ పరిశ్రమలో ఇప్పుడు అంతటా వినిపిస్తున్నది ప్రకాష్ రాజ్-ఆగడు టీమ్ కు జరిగిన వివాదమే. ఈ వివాదం మొదట్లో గుట్టు చప్పుడు కాకుండా ముగిసిపోతుందని అంతా భావించారు. అయితే ఈ మ్యాటర్ డైరక్టర్స్ అశోశియేషన్ సీరియస్ గా తీసుకోవటంతో అనుకున్నంత ఈజీగా ముగిసేటట్లు లేదని సమాచారం. బ్యాన్ పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు.

Prakash Raj courts another controversy...emergency meeting

మరో ప్రక్క ప్రకాష్ రాజ్ ని తీసేసి ఆ ప్లేస్ లో సోనూ సూద్ ని తీసుకుని ఆగడు టీమ్ షూటింగ్ మొదలెట్టింది. అంతేకాకుండా 75 లక్షలు వరకూ ప్రకాష్ రాజ్ నుంచి వసూలు చేయాలని అడుగుతున్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ ఇంతకు ముందులా కేవలం నటుడుగానే ఉండకుండా దర్శకుడు అవతారం ఎత్తి ఉలవచారు బిర్యాని అనే చిత్రం చేస్తున్నారు. దాంతో ఆయన ఆ బిజీలో ఉంటూ తను ఇతర సినిమాలకు ఇచ్చిన డేట్స్ కు సరిగా హాజరు కావటం లేదు. అదే పద్దతిలో ఆగడు టీమ్ కూడా ఇబ్బంది పడిందని సమాచారం.

షూటింగ్ స్పాట్ కు ప్రకాష్ రాజ్ ఎప్పుడూ లేటేనని, వచ్చి అసెస్టెంట్ డైరక్టర్స్ పై అరవటం వంటివి చేయటం జరిగేదని చెప్తున్నారు. అయితే ఓ రోజు కో డైరక్టర్ ని విపరీతంగా తిట్టాడని దాంతో అతనే దర్శకుల సంఘంలో కంప్లైట్ చేసాడని సమాచారం. ప్రకాష్ రాజ్ విచిత్రమైన ప్రవర్తనతో విసిగినా షూటింగ్ కి ఇబ్బంది కలగకూడదని భావించిన శ్రీను వైట్ల ఆయనకు సర్ది చెప్దామని చాలా ప్రయత్నించాడు. అయితే తను ఇక షూటింగ్ రానని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు.

దూకుడులో విలన్ గా చేసిన సోనూసూద్...ని వెంటనే రప్పించి ఆ సీన్స్ అతనిపై షూట్ చేయటం శ్రీను వైట్ల మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ షాక్ అయ్యాడట. ఈ వివాదంలో మొదటి నుంచీ దూరంగా ఉంటూ వచ్చిన వారు మహేష్ బాబు అంటున్నారు. ప్రకాష్ రాజ్ తో గతంలో అనేక చిత్రాలు చేసిన మహేష్ బాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగానే మౌనంగా ఉండి,ఎవరికీ సపోర్టు చేయలేదని అంటున్నారు.

ప్రకాష్ రాజ్ కి తెలుగు పరిశ్రమలో సన్నిహితుడు ఎవరూ అంటే దిల్ రాజు. ఆయన సినిమాల్లో తప్పనిసరిగా ఉండే ప్రకాష్ రాజ్ అంటే దిల్ రాజు కు మంచి అభిమానం. దాంతో తన తరుపు మనిషిగా దిల్ రాజుని ఈ వివాదం పరిష్కరించమని పంపాడని సమాచారం. ఆగడు చిత్రం నిర్మాతల నుంచి ప్రకాష్ రాజ్ తీసుకున్న 75 లక్షలు తిరిగి చెల్లించి, లక్ష రూపాయలు ఫైన్ గా కట్టాలని దర్శకుల మండలి తీర్మానించినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X