twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ జగన్ కొడుకుని డైరక్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్

    By Srikanya
    |

    స్వీయ నిర్మాణంలో ప్రకాశ్‌రాజ్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ధోని'. డ్యూయెట్ మూవీస్ పతాకంపై తయారవుతున్న ఈ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ ఓ ముఖ్య పాత్రను చేస్తున్నాడు. కన్నడ చిత్రం 'నాను నన్న కనసు'తో దర్శకుడిగా మారిన ప్రకాశ్‌రాజ్ నిర్దేశకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది.ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. సినిమా రూపకల్పన అనేది చక్కని వర్ణచిత్రం గీయడం లాంటిది. ఆ అందమైన పెయింటింగ్‌లో పొందికైన రంగులాంటివాడు నటుడు. సప్త వర్ణాలతో ఆ చిత్రానికి జీవం పోసేవాడే దర్శకుడు. నా తొలి చిత్రం డ్యూయెట్ నుంచి నేటి వరకూ... వందల వర్ణచిత్రాలలో నేను కూడా రంగులా అల్లుకుపోయాను. కానీ ధోని* చిత్రం కళాకారుడిగా నా జన్మ సార్థకత చేసింది. ఎందుకంటే... ఇక్కడ రంగునూ నేనే... చిత్రకారుణ్నీ నేనే.నా దర్శకత్వంలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాకు నేను దర్శకుడ్ని అవ్వడం, నన్ను నేను ఆవిష్కరించుకోవడమే కాదు.. పునఃసమీక్షించుకోవడం కూడా అని ప్రకాష్‌రాజ్ అన్నారు. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు. చాలాకాలం తర్వాత ఈ సినిమా కోసం ఆయన లైవ్ రికార్డింగ్ చేశారు. ప్రకాష్‌రాజ్ అభ్యర్థన మేరకు నేపథ్య సంగీతాన్ని కూడా లైవ్‌గా రికార్డ్ చేయడానికి ఇళయరాజా అంగీకరించడం విశేషం. ఇప్పటికే రికార్డింగ్ మొదలైంది. అక్టోబర్ నెలాఖరు వరకు ఏకధాటిగా హైదరాబాద్, చెన్నయ్‌లలోని పలు ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకునే ।ధోని* చిత్రాన్ని డిసెంబర్‌లో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి ప్రకాష్‌రాజ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, నిర్మాణం: డ్యూయెట్ మూవీస్.

    English summary
    Duet movies, the name of his banner which is as unique as himself, will be producing the film Dhoni in Telugu and Tamil and prakash raj will be directing and producing the film in both versions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X