twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదాన్ని మళ్ళీ రేపిన ప్రకాశ్ రాజ్: కృష్ణవంశీ, తమ్మారెడ్డి భరద్వాజలతో కలిసి పుస్తకావిష్కరణ

    ఒక్క గొంతును నొక్కాలనుకుంటే... వెయ్యిగొంతుకలు పుట్టుకొస్తాయన్నారు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. గౌరి లంకేశ్ రచనల సంకలనం కొలిమి రవ్వలు పుస్తకాన్ని మంగళవారం ఆయన లామకాన్‌లో ఆవిష్కరించారు.

    |

    ఒక్క గొంతును నొక్కాలనుకుంటే... వెయ్యిగొంతుకలు పుట్టుకొస్తాయన్నారు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. గౌరి లంకేశ్ రచనల సంకలనం కొలిమి రవ్వలు పుస్తకాన్ని మంగళవారం ఆయన నగరంలోని లామకాన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పౌరులెప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంటారన్నారు. పాత్రికేయురాలుగా, సామాజిక కార్యకర్తగా గౌరి లంకేశ్ నిరంతరం ప్రశ్నను సంధించిందని, అందుకే.. ఆ ప్రశ్నను అంతం చేయాలనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    Recommended Video

    పన్నులు కడుతున్నాం కదా.. రక్షణ ఏది ?
    ఎక్కడా రాజీ పడకుండా

    ఎక్కడా రాజీ పడకుండా

    గౌరి ఏ ఆశయాల కోసమైతే నిలబడిందో మనమంతా వాటికోసం నిలబడాలన్నారు. నిరంతరం ప్రశ్నించడమే మనం చేయాల్సిన పని అన్నారు. గౌరి తండ్రి ప్రభావం తనపై చాలా ఉందని... ఆయన ఎక్కడా రాజీ పడకుండా లంకేశ్ పత్రికను నడిపారని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన భావాలను పంచుకున్నారు.

    గొప్ప రచయిత కూడా

    గొప్ప రచయిత కూడా

    "గౌరి తండ్రి తను కేవలం పాత్రికేయుడు మాత్రమే కాదు. గొప్ప రచయిత కూడా. ఆయన పత్రిక యువ రచయితలకు కవులకు కాలమిస్టులకు వేదిగా మారింది. నాలాంటి వాళ్లకు ఒక అవగాహనను అందించింది. ఎందరో ఆలోచనా పరుల్ని రచయితల్ని తయారు చేసింది.

    మనం ఎప్పుడూ ప్రతి పక్షంలో ఉండాలి

    మనం ఎప్పుడూ ప్రతి పక్షంలో ఉండాలి

    ఆయన సంపాదకీయాలు చదివి ముఖ్యమంత్రులు సైతం తన కార్యాలయానికి వచ్చి మాట్లాడేవారంటే ఎంతటి ప్రభావ వేశాడో అర్థం చేసుకోవచ్చు. "మనం ఎప్పుడూ ప్రతి పక్షంలో ఉండాలి" అని ఆయన చెప్పేవారు. ఆయన కూతురుగా గౌరి లంకేశ్ అదే పాత్ర పోషించింది.` అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

     మాట్లాడినందుకే గౌరి హత్య

    మాట్లాడినందుకే గౌరి హత్య

    గౌరి లంకేశ్ చూస్తుండగానే ఒక పాత్రికేయురాలు నుండి ఉద్యకారిణిగా పరివర్తన చెందిందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. `నమ్మిన వాటిని నిష్కర్షగా చెప్పడం తనకు అలవాటు. అలా మాట్లాడినందుకే గౌరి హత్య. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలుంటే చర్చించాలి తప్ప... హత్యలు చేయడం సరైంది కాదు.

     జాస్వామ్యం మీద దాడులు

    జాస్వామ్యం మీద దాడులు

    నిజానికి ఏ మతమూ హింసను ప్రోత్సహించదు. అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా. ధర్మం పేరుతో చేసే హింసను ప్రతిఘటించాలి. ప్రజాస్వామ్యం మీద దాడులు జరుగుతున్న ప్రస్థుత సందర్భంలో మౌనం వహించడం విషాదం. ఒక గొంతును నొక్కేస్తే... వంద గొంతులు ఉద్బవించాలి.

     మౌనం వీడాలి

    మౌనం వీడాలి

    మన మౌనం వీడాలి. ప్రశ్నించాలి. అది మోడీ అయినా... అతని ఫాలోవర్స్ అయినా భయం లేకుండా ప్రశ్నించాలి. మోడీ వ్యవస్థకు ప్రతినిధి మాత్రమే. మనం పోరాటం ఆ వ్యవస్థమీద సాగాలి. వ్యక్తులుగా రాజకీయాలకు అతీతులమని అనుకోవడం అర్థ రహితం. మన జీవితంలో ప్రతి క్షణం రాజకీయాలతో ముడిపడిందే.` అని ప్రకాశ్ రాజ్ అన్నారు. కృష్ణవంశీ, తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులూ, సాహితీ వేత్తలు కూడా పాల్గొన్నారు.

    English summary
    Prakash Raj speech about Jurnalist gaureelankesh book inaguration at Lamakan Hyderabad .ఒక్క గొంతును నొక్కాలనుకుంటే... వెయ్యిగొంతుకలు పుట్టుకొస్తాయన్నారు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X