twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతఃపురానికే అవార్డు వస్తుందనుకున్నా

    By Staff
    |

    Prakash Raj
    తమిళ చిత్రం "కంజీవరం"లో నటించిన ప్రకాష్‌రాజ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా సమిష్టి కృషిగా ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు కాంచీపురంలో చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై ప్రియదర్శన్ ఎంతో కమిట్‌మెంట్‌తో తెరకెక్కించారని, ఇందులో నటీనటులు బాధ్యతగా చేశారని ఆయన తెలిపారు. దర్శకుడు, రచయిత, సహచర నటుల తపనే తనకు ఈ అవార్డు దక్కేలాచేసిందని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకే అవార్డు దక్కడంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. గతంలో కృష్ణవంశీ "అంతఃపురం" సినిమా చేశారని, ఆ సినిమాకే జాతీయ అవార్డు వస్తుందనుకున్నానని చెప్పారు. అంతఃపురం తరహాలో సినిమాలు రూపొందించేందుకు మరికొంతమంది దర్శకులు ఆ దిశగా దృష్టిసారిస్తే తప్పనిసరిగా తెలుగు సినిమాలకు కూడా అవార్డులు వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రకాష్‌రాజ్‌కు అవార్డు దక్కడం పట్ల పలువురు సినీప్రముఖులు సంతోషం వ్యక్తం చేసారు.

    అంతఃపురంకు వస్తుందనుకున్నా: కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ మంచి నటుడు. అంతఃపురంలో ఆయన నటన అద్భుతం. ఆ చిత్రానికి అవార్డు వస్తుందని ఆశించాం. ఆ టైమ్‌లో ఆయనకంటే గొప్పనటుడు ఉండొచ్చు. అందుకే రాలేదు. ఏది ఏమైనా స్నేహితుడు ప్రకాష్ రాజ్‌కు ఆలస్యంగానైనా అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

    మా బేనర్‌లో ఎన్నో సినిమాలు చేశాడు: దిల్‌రాజు తమ బేనర్‌పై నిర్మితమైన అన్ని చిత్రాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు. తెలుగు సినిమాకు రాకపోయినా తమిళ చిత్రం ద్వారా అయినా ఆయన నటన వెలుగులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. హిందీలో ఎంతోమంది పోటీపడినప్పటికీ ప్రకాష్ రాజ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడం సముచితమని దిల్‌రాజు చెప్పారు.

    జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అర్హునికే దక్కింది: తమ్మారెడ్డి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అర్హునికే దక్కిందని తమ్మారెడ్డి అన్నారు. సమర్థుడైన నటునికి జాతీయస్థాయి గుర్తింపు రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X