ఒక పౌరుడిగా గర్వపడుతున్నాను.. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ పోస్ట్

లాక్ డౌన్ సమయంలో ప్రకాష్ రాజ్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. సొంత వ్యవసాయ క్షేత్రంలో ఫ్యామిలీతో గడుపుతున్న ప్రకాష్ రాజ్ వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్‌లో ఫ్యామిలీతో పనులు చేసుకుంటూ.. లాక్ డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపిన ప్రకాష్ రాజ్ తనకు చేతనైన సాయాన్ని చేస్తూ వస్తున్నాడు.

తన వద్ద డబ్బు లేకపోయినా.. అప్పు తెచ్చి మరీ సాయం చేయడంపై అందరూ ప్రశంసలు కురిపించారు. తాను అప్పు అడిగితే ఇచ్చేవారు చాలా మంది ఉన్నారని, అలాంటప్పుడు అప్పు తీసుకుని సాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదని అన్నాడు. ఒక్కసారి షూటింగ్ మొదలైతే అందరి అప్పులు తీర్చేయొచ్చని చెప్పుకొచ్చాడు. ఎన్నో స్వచ్చంద సంస్థలతో చేతులు కలిపి ఎంతో మంది వలస కార్మికులకు, పేదలకు ఆకలి బాధ లేకుండా చేస్తున్నాడు.

Prakash Raj Felt Sad Passing Migrants From Farmhouse

అయితే ఇంత వరకు తన ఫామ్ హౌస్‌లో ఉన్న వలస కార్మికులు వెళ్లిపోతుండటంతో ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. 'వలస కార్మికులను సురక్షితంగా తరలిస్తున్న కేటీఆర్‌గారికి, తెలంగాణ డీజీపీ‌గారికి ధన్యవాదాలు. దాదాపు 44 రోజులు వారందరూ నా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. వారు వెళ్లిపోతుంటే వాళ్లని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. వారి జీవిత కథల నుంచి, వారు చూపించిన ప్రేమ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ కష్టకాలంలో వారిని నిరాశ పరచకుండా అండగా నిలబడినందుకు.. ఒక పౌరుడిగా గర్వపడుతున్నాను. ఆనందంగా ఉంద'ని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X