సిగ్గు లేదంటూ... శ్రీను వైట్లపై ప్రకాష్ రాజ్ ఫైర్
హైదరాబాద్: దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న విబేధాలు రచ్చకెక్కాయి. ఆగడు సినిమా సమయంలో ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల మధ్య విబేధాలు పొడ చూపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ ను సినిమా నుండి తప్పించాడు శ్రీను వైట్ల. అప్పట్లో ఇదో సంచలనం. ‘ఆగడు' సెట్లో జరిగిన గొడవ కారణంగా ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది.
అప్పటి నుండి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రకాష్ రాజ్.....శ్రీను వైట్ల పై మండి పడ్డారు. తన ఆవేదనను పద్య రూపంలో చెబితే తన అనుమతి లేకుండా శ్రీను వైట్ల తన సినిమాలో వాడుకున్నారని, ఏ మాత్రం సిగ్గున్నా తన అనుమతి తీసుకుని ఉండాల్సిందని ప్రకాష్ రాజ్ ధ్వజమెత్తారు.

కక్ష్యతో కాదు...కసితో పని చేయాలని శ్రీను వైట్లకు సూచించారు ప్రకాష్ రాజ్. ఇంతటితో ఆగని ప్రకాష్ రాజ్ ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆగడు' సినిమా విషయాన్ని కూడా ప్రస్తావించారు. డబ్బులు పెట్టే నిర్మాతలున్నా మహేష్ బాబు అభిమానులు మెచ్చే విధంగా శ్రీను వైట్ల సినిమా తీయలేక పోయారని విమర్శించారు.
ఉన్నట్టుండి ప్రకాష్ రాజ్.....ఈ రేంజిలో ఫైర్ కావడం హాట్ టాపిక్ అయింది. మరి ఈ వివాదం ఇంటితో ముగుస్తుందా? ఇంకా ముందుకెలుతుందా? దీనిపై శ్రీను వైట్ల ఎలా స్పందిస్తారు? వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలని ప్రయత్నించే తెలుగు సినిమా పరిశ్రమలోని పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











