రామ్ చరణ్ చిత్రంలో ప్రకాష్ రాజ్ డిఫెరెంట్ లుక్(ఫోటో)
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా 'జంజీర్' . ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఓ డిఫెరెంట్ లుక్ తో కనిపించనుంది. ఆ లుక్ ఇప్పుడు మీడియాలో వెలబడి అందరి మన్ననలూ పొందుతోంది. 'జంజీర్'ను హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ చిత్రంలో చెర్రీ యాంగ్రీ యంగ్‌మేన్‌గా నటిస్తున్నారు. పోలీసాఫీసర్‌గా పవర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. మరి చెర్రీ అంత పవర్ ఫుల్ గా ఉన్నప్పుడు టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటేనే బాక్సాఫీసు షేకవుతుందని అంచనాలు వేస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. బిగ్ బి అమితాబ్ పాతికేళ్ల క్రితం నటించిన 'జంజీర్' చిత్రానికి ఇది రీమేక్.
హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. గతంలో మగధీర చిత్రంలోనూ శ్రీహరి 'షేర్ ఖాన్' పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అతని పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం కాకతాళీయమే అయినా..... అతనిపై పాత్రపై సర్వత్రా ఆస్తి నెలకొంది.
అలాగే ఈ చిత్రానికి 'తుఫాన్' అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు ఫిల్మ్ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వేసవి చివర్లో అంటే జూన్ నెలలో ఈ చిత్రం థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.


Click it and Unblock the Notifications











