వాహ్ ప్రకాశ్‌రాజ్: అప్పు చేసి 1000 కుటుంబాలకు అండగా.. మానవత్వాన్ని చాటిన..
కరోనావైరస్ కారణంగా పేద ప్రజలకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ప్రకాశ్ రాజ్ తన వ్యక్తిగత సిబ్బందికి ముందస్తుగానే జీతాలు ఇచ్చేసి వారిని ఆదుకొన్నారు. ఇక లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి మరింత ముప్పుగా మారడంతో ప్రకాశ్ రాజ్ పేదలకు చేయూతనిస్తున్నారు. తన ఫామ్‌హౌస్‌కు సమీపంలోని గ్రామాల ప్రజలకు ఆర్థిక, నిత్యావసర వస్తువుల సరఫరా చేస్తూ ఆదుకోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

పేదలకు అండగా ప్రకాశ్ రాజ్
కరోనావైరస్ లాక్‌డౌన్‌తో పేద ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ఎవరికి తోచిన విధంగా వారిని ఆదుకొంటున్నారు. అదే క్రమంలో 1000కి పైగా కుటుంబాలను ఆదుకొంటూ మానవత్వాన్ని చాటుతున్నారు. స్వయంగా ఆయన బ్యాంకు నుంచి అప్పుగా తీసుకొని పేదలకు నిత్యావసర వస్తువులను చేరవేస్తున్నారు.

అప్పు ఎప్పుడైనా తీర్చొచ్చు.. పేదల కష్టాలే ఇప్పుడు
పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణి విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. నా ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించింది. అయితే అప్పుగా కొంత మొత్తాన్ని తీసుకొని పేద ప్రజలకు సహాయం అందిస్తున్నాను. ఎందుకంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చనే ధైర్య నాకుంది. ఈ పరిస్థితిలో మానవత్వం బతికి ఉండాలనేది నా అభిప్రాయం. కరోనాను తరిమి కొట్టడానికి మనమంతా ఐక్యంగా పోరాటం చేద్దాం. ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్‌కు చేయూతనివ్వండి అని ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశారు.
1000కి పైగా కుటుంబాలకు
లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 1000కిపైగా కుటుంబాలను ఆదుకొంటున్నాం. నా ఫామ్‌లో మరో 30 మంది బాధితులను సంరక్షణ ఏర్పాటు చేశాం. దయచేసి ప్రభుత్వ ఆదేశాలను గౌరవించండి. ఇంటి వద్దనే ఉంటూ సురక్షితంగా ఉండండి. నేను కూడా మీలా ఫాంహౌస్‌లోనే ఉంటున్నాను అని ప్రకాశ్ రాజ్ మరో ట్వీటర్ చేశారు.
Recommended Video

పారిశుద్ధ కార్మిక కుటుంబాల కోసం
అంతేకాకుండా కర్ణాటకలోని పారిశుద్ద కార్మిక కుటుంబాలకు ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ అండగా నిలిచింది. దాదాపు 25 కుటుంబాలకు నిత్వావసర వస్తువుల పంపిణి, ఇతర అవసరాలను తీర్చడానికి ముందుకొచ్చారు. అంతేకాకుండా మీ సమీపంలోని పారిశుద్ద కార్మికులను గుర్తించి వారికి అండగా నిలవండి.. మానవత్వాన్ని వేడుకల జరుపుకోవడానికి ఇదే శుభ సమయం అని ఆయన ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











