ఏం అనిపిస్తే అది చేయడానికి ఒకడు పుట్టాడు..వాడే ప్రకాష్ రాజ్..: పూరి
దక్షిణాదికి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నేడు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకొంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రకాష్ రాజ్ యాక్ట్ చేస్తోన్న సినిమాల్లో 'ది బిజినెస్ మ్యాన్" ఒకటి. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడ ప్రకాష్ రాజ్ పాల్గొనగా ఓ రిస్కీ సీన్ తీశారట. ఈ సీన్ లో భాగంగా ప్రకాష్ రాజ్ నీళ్లల్లో దూకాలట. పూరి ఈ సీన్ గురించి చెప్పగానే ప్రకాష్ రాజ్ మరో ఆలోచనకు తావివ్వకుండా దూకేశాడట. దీని గురించి పూరి చెబుతూ .'ఏం అనిపిస్తే అది చేయడానికి ఒకడు పుట్టాడు. వాడే ప్రకాష్ రాజ్..నేను సీన్ చెప్పగానే ఎంతో తెగువగా నీళ్లల్లో దూకేశాడు" అన్నారు..
విలక్షన నటుడిగా ప్రతిభా పాటవాలున్న నటుడిగా జాతీయ సినీ అవార్డు విజేత అయిన ప్రకాష్ రాజ్ బాలీవుడ్ లోనూ వివిధ చిత్రాలు చేస్తూ విలన్ గా పాపులారిటీ సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కు బాలీవుడ్ లో మరో 'బ్యాడ్ మ్యాన్'గా పేరు వస్తుండడం విశేషం. సల్మాన్ ఖాన్ హిట్ చిత్రం వాంటెడ్ (2009)లో విలన్ గా ఎంతో బాగా నటించి హిందీ ప్రేక్షకులను అలరించారు ప్రకాష్‌రాజ్. అనంతరం ఈ ఏడాది అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ సినిమా 'సింగమ్' లో విలన్ గా అద్భుతంగా నటించిన ఆయన సన్నీడియోల్ కొత్త చిత్రం 'గాయల్ రిటర్న్'లో నెగటివ్ రోల్ లో నటించేందుకు అవకాశం వచ్చింది. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది.


Click it and Unblock the Notifications











