నాగార్జున స్కూల్లో హెడ్ గా ప్రకాష్ రాజ్
నాగార్జున రీసెంట్ గా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాని ప్రారంభించారు. ఇందులోని నటన విభాగానికి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ హెడ్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున చెపుతూ.. ప్రకాష్‌రాజ్ ఎలాంటి నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్కూల్ గురించి ప్రస్తావించగానే ఆయన చెప్పిన విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. నటుల్ని తీర్చిదిద్దడంలో ఆయన చెప్పిన కొత్త పద్ధతులు నేటి తరానికి అవసరం. నటన విభాగానికి ఆయన్ని హెడ్‌గా తీసుకున్నందుకు గర్వంగా ఉంది.
మణిరత్నం, శోభన, రేవతి, అనిల్ మెహతా, రసూల్ పూకుట్టి లాంటి సినిమా రంగ ప్రముఖుల సూచనలు సలహాలతో ఈ స్కూల్ నడుస్తుందన్నారు.అలాగే ప్రతి వ్యక్తిలోనూ ఓ నటుడు ఉంటాడు. గుర్తించి శిక్షణ ఇస్తే పరిపూర్ణమైన నటుడుగా మారతాడు అని చెప్పారు నాగార్జున.ఇక ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ ..నటనపై ఆసక్తి ఉన్న యువకులు దేశంలో వేల కొద్దీ ఉన్నారు. వారిని నేటి పరిస్థితులకు తగ్గట్టు తీర్చిదిద్దాలి. ఇక్కడ నటించడం ఎలాగో నేర్పించం. ప్రతిభని వెలికి తీసి సానపెడతామన్నారు.


Click it and Unblock the Notifications











