twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హత్య బాధిస్తున్నది.. సోషల్ మీడియాలో పండుగ చేసుకొన్నారు.. ప్రకాశ్ రాజ్

    By Rajababu
    |

    ప్రధాని నరేంద్రమోదీపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్య జరిగి నెల కావస్తున్నా ఆ సంఘటనపై ప్రధాని పెదవి విప్పకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ సర్కారు ఇచ్చిన అవార్డులను తిరిగి వెనుక్కు ఇస్తాను అని ప్రకాశ్ నిరసన స్వరం వినిపించారు. గౌరీ, ప్రకాశ్ రాజ్ ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే.

     కేంద్ర ప్రభుత్వ తీరు శోచనీయం

    కేంద్ర ప్రభుత్వ తీరు శోచనీయం

    బెంగళూరులో డెమాక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాకన్నా పెద్ద నటుడు. నాకు వచ్చిన నేషనల్ అవార్డులను అందుకోవడానికి ఆయన ముమ్మాటికి అర్హుడు. పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ హత్య ఘటనపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధ కలిగిస్తున్నది. ఆమె హత్యపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం అని బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్‌ అన్నారు.

    Recommended Video

    కన్నడ పాత్రికేయురాలు గౌరి లంకేష్ హత్య: ప్రత్యక్ష సాక్షులు
     ఐదు జాతీయ పురస్కారాలను

    ఐదు జాతీయ పురస్కారాలను

    గౌరీ లంకేష్ హత్యపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ తనకు వచ్చిన ఐదు జాతీయ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని భావిస్తున్నాను. ప్రధానికి సన్నిహితంగా ఆయన కనుసన్నల్లో మెలిగే కొందరు గౌరీ హత్య తర్వాత సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు అని ఆరోపించారు.

    యోగీ సీఎంమా? పూజారా?

    యోగీ సీఎంమా? పూజారా?

    ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం నడుస్తున్న తీరు, ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న యోగీ ఆధిత్యనాథ్‌ ముఖ్యమంత్రో, దేవాలయాల్లో పూజరో తెలియక సతమతమవడం ఖాయం. అలా ఆ పార్టీకి చెందిన కొందరు ద్విపాత్రాభినయం చేస్తున్నారు అని ప్రకాష్‌రాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

     మోదీ నాకంటే గొప్ప నటుడు

    మోదీ నాకంటే గొప్ప నటుడు

    నా నటనా ప్రతిభను గుర్తించి ఇప్పటి వరకు కేంద్రం నాకు ఐదు జాతీయ అవార్డులు అందజేసింది. గౌరీ లంకేష్ హత్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేను వాటిని వెనక్కు ఇచ్చేయాలని భావిస్తున్నాను ఎందుకంటే వారంతా నాకంటే పెద్ద నటులు అని ప్రకాశ్ చురకలు అంటించారు.

    English summary
    Actor Prakash Raj hit out at Prime Minister Narendra Modi for his silence on journalist Gauri Lankesh’s murder and said that politicians deserved his national awards more than he did.Speaking at the inauguration of the 11th State meet of the Democratic Youth Federation of India, Prakash Raj hit out at Prime Minister Narendra Modi for being silent on journalist Gauri Lankesh’s murder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X