‘శకుని’తో చేతులు కలిపి ప్రకాష్ రాజ్!
'యుగానికి ఒక్కడు', 'ఆవారా' ఫేం కార్తీ హీరోగా శంకర్ దయాళ్ దర్శకత్వంలో 'శకుని' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కార్తీ సరసన ప్రణీత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో సలీం గౌస్ విలన్ పాత్రలో నటించాడు. అయితే సినిమా అంతా అయిపోయాక చూసుకుంటే అతని నటన బాగోలేదని, అదే సినిమాకు మైనస్ అయ్యేట్లు ఉంది... దర్శక నిర్మాతలతో బాటు, కార్తీ, వాళ్ల తండ్రి ప్రముఖ నటుడు శివకుమార్ అసంతృప్తికి గురయ్యారట. దాంతో, ఇప్పుడు ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారని తెలుస్తోంది. తిరిగి ఆ సీన్స్ ను ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో త్వరలో హైదరాబాదులో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపిస్తే సినిమాపై మంచి అంచనాలుంటాయనే ఆలోచన కూడా ప్రకాష్ రాజ్‌ను తీసుకోవడానికి మరో ప్రధాన కారణం అంటున్నారు.
దర్శకుడు గతంలో ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ మాట్లాతుతూ.."ఇది పొలిటికల్ సెటైర్ మూవీ, ఓ ట్రావెల్‌లాగా ఉంటుంది, కార్తీ పాత్రలో చాలా వైవిధ్యత ఉంటుంది'' అని అన్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. సంతానం, రాధిక, కోట శ్రీనివాసరావు, రోజా, నాజర్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, కెమెరా: పి.జి.ముత్తయ్య, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: ప్రేమ్క్ష్రిత్, బాబా భాస్కర్, ఎడిటింగ్: శ్రీకర్.


Click it and Unblock the Notifications











