బరిలోకి దిగిన మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ మూవీ.. ఏది ఏమైనా రాజమౌళి కంటే ఘనుడే!!
దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ ఇంకా దారుణంగా ఉంది. ఈ కారణంగానే ప్రభుత్వాలు షూటింగ్ జరపడానికి అనుమతులు ఇచ్చినా పెద్ద చిత్రాలేవీ సెట్స్‌పైకి వెళ్లడం లేదు. ఇక ఇటీవలె కేంద్ర ప్రభుత్వం కూడా షూటింగ్స్ జరుపుకోవడానికి అనుమతులను ఇచ్చింది. ఈ కారణంగానే కొందరు ముందడుగు వేస్తున్నారు. అయితే ప్యాన్ ఇండియన్ చిత్రాలు మాత్రం ఇప్పుడిప్పుడే సెట్స్‌పైకి తీసుకురావడానికి సిద్దంగా లేవు. కానీ కేజీయఫ్ టీమ్ మాత్రం ఆ దిశగా అడుగులు వేసింది.

భారీ బడ్జెట్ చిత్రాలు వెనుకడుగు..
రాష్ట్రాలు ఇచ్చిన సడలింపులతో చిన్న చిన్న సినిమాలు, టీవీ పరిశ్రమకు చెందిన షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి. అందులో ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు లోబడే వంద మందిలోపే ఉండేట్టు చూసుకుంటున్నారు. కానీ ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ వంటి జాతీయ స్థాయి చిత్రాలకు అది కాస్త ఇబ్బంధి పెట్టే అంశమే.

సినిమా పరిశ్రమలో కరోనా..
అసలే సినిమా పరిశ్రమలో కరోనా అంతకంతకూ పాకుతోంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. అందుకే పెద్ద హీరోలందరూ షూటింగ్స్ అంటే ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్, కేజీయఫ్, పుష్ప వంటివి సెట్స్ పైకి వెళ్లలేదు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడంటే..
ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలెట్టేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టి కనిపిస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని వినికిడి. అయితే ఇది కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కానీ కేజీయఫ్ యూనిట్ మాత్రం ముందడుగు వేసేసింది.

ప్రకాశ్ రాజ్‌తో షూటింగ్..
ఇక ఏది ఏమైనా సరే అని కేజీయఫ్ టీమ్ మాత్రం రంగంలోకి దిగింది. ఇలా కరోనా తరువాత లాంగ్ గ్యాప్‌లో షూటింగ్ మొదలెట్టిన మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ చిత్రంగా కేజీయఫ్ రికార్డ్ సృష్టించింది. ఇక మరి ఆర్ఆర్ఆర్, పుష్ప, రాధేశ్యామ్ ఎప్పుడు మొదలవుతాయో చూడాలి. ఈ రోజు కేజీయఫ్ సెట్‌లో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నాడు. వీటికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా మొత్తంగా జక్కన్న కంటే దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు ప్రశాంత్ నీల్.


Click it and Unblock the Notifications











