రియలా? ఫేకా? ‘రుద్రమదేవి’లో ప్రకాష్‌రాజ్ లుక్ (ఫోటో)
హైదరాబాద్: అనుష్క మెయిన్ రోల్‌లో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క, రానా, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్య మీనన్, నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, బాబా సెహగల్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, అర్పిత్ రాంకా, వేణు మాధవ్, వెన్నెల కిషోర్, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, కృష్ణ భగవాన్, ప్రభ, అదితి చెంగప్ప, సంధ్యా జనక్, అనితానాథ్, సుబ్బరాయశర్మ, సంపత్ రాజ్, జీవా, రవిప్రకాష్, వినోద్, ప్రసన్నకుమార్, టీవీ 9 హర్ష, ఈ టీవీ ప్రభాకర్, పార్థసారథి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ శివదేవయ్య పాత్రలో నటిస్తున్నాడు. రుద్రమదేవికి రాయల్ అడ్వైజర్‌గా ఈచిత్రంలో ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు. తాజాగా ఇంటర్నెట్ లో ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోనే 'రుద్రమదేవి'లో ప్రకాష్ రాజ్ లుక్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా కాకతీయుల కాలం నాటిటి. ఇక్కడున్న ఫోటోలో ఆయన లుక్ చూస్తే ఇప్పటి సినిమాల్లో మాదిరిగా ఉంది. చూస్తే నమ్మబుద్ది కావడం లేదు. మరి ఈ ఫోటో నిజంగా రుద్రమదేవి సినిమాలోనిదేనా? లేక ఫేక్ ఫోటోనా? అనేది త్వరలో తేలనుంది.

రుద్రమదేవి చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: తోటతరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజైనర్ : నీతా లుల్లా, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటల: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయిబాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామగోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











