twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బహుముఖ ప్రజ్ఝశాలి ‘ప్రకాశ్ రాజ్’ బాలీవుడ్ హంగామ

    By Staff
    |

    'ప్రకాశ్ రాజ్", తెలుగు, తమిళ సినిమాలలో నెంబర్ వన్ విలన్ గానే కాక, తండ్రి, హీరో లాంటి బహు పాత్రలలో నటించాడు, నటిస్తున్నాడు. వంశీ, పూరిజగన్నాథ్, వి.వి. వినాయక్ వంటి పెద్ద డైరెక్టర్స్ 'ప్రకాశ్ రాజ్" తో సినిమా తీస్తున్నారంటే అందులో ప్రకారాజ్ పాత్రకి మంచి కథను సెట్ చేయడంతో ఆ సినిమాకి అతని పోషించే ఏ పాత్రయైనా హైలెట్ గా నిలిస్తుంది. తనదైన శైలిలో ప్రతి పాత్రలోనూ లీనమై నటించడం అతని ప్రతిభ. అందుకే కాబోలు తమిళ 'కాంచీవరం" సినిమా కు నేషనల్ అవార్డు దక్కించుకొన్నాడు. మొన్న ఈ మధ్య ప్రభుదేవా దర్శకత్వంలో తెలుగు, తమిళం, హిందిలో రూపొందిన చిత్రం 'వాంటెడ్". ప్రపంచం మొత్తం ఒకే రోజు విడుదలైనది. ఈ త్రి భాష చిత్రంలో ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన విలన్ పాత్రను పోషించారు.

    'వాంటెడ్" సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఘనీబాయ్(ఆలీ బాయ్ -పోకిరి)గా తన పెర్ఫామెన్స్ తో ఈ సినిమాకి హైలెట్ గా నిలిచిందని అటు సినిమా చూసిన ప్రేక్షకులు, ఇటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వారు పోగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ గజిని సినిమా విజయం తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన 'వాటెండ్" సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలకు పునర్జీవం పోశారన్నారు. తర్వత ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ తను మరిన్ని విభిన్నమైన పాత్రలు చేయాలని, అలాగే కమర్షియల్ చిత్రాలలో కూడా నటించాలని దాంతో అతని కోరిక తీరుతుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X