24న ప్రకాష్ రాజ్ వివాహం
క్యారిక్టర్ ఆర్టిస్టు ప్రకాష్ రాజ్ త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్నారు. వచ్చే నెల 24న ఈ వేడుక జరుగుతుంది. బాలీవుడ్ చిత్రాలకు కొరియోగ్రఫీ వహించే పోనీ వర్మను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. పోనీ అసలు పేరు రష్మి వర్మ. ఈమె దక్షిణాదికి చెందిన యువతి. అయితే ఎక్కువగా హిందీ చిత్రాలకే నృత్యరీతులు సమకూరుస్తుంటారు. 'హంగామా', 'హల్ చల్', 'చాందినీ చౌక్ టు చైనా', 'దె ధనాధన్' లాంటి చిత్రాలకు పోనీ పని చేశారు. వివాహ వేదిక, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రకాష్ రాజ్ కు గతంలోనే లలిత కుమారితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవలే లలిత కుమారికి విడాకులిచ్చారు. అలాగే రీసెంట్ గా కన్నడంలో ఆకాశమంత రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా ప్రత్యేక ప్రదర్శన సమయంలో ప్రకాష్ రాజ్ సన్నిహితులకు ఈ పెళ్లి కబురు చెప్పారు.
ప్రకాష్ రాజ్ ప్రియదర్శన్ సల్మాన్ ఖాన్ పోకిరి లలితా కుమారి prakash raj lalitha kumari salman khan pokiri


Click it and Unblock the Notifications