»   »  మహేష్ 'ఆగడు'లో కాదంటూ ప్రకాష్ రాజ్

మహేష్ 'ఆగడు'లో కాదంటూ ప్రకాష్ రాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aagadu
హైదరాబాద్ : పాత్ర ఏదైనా సరే... అందులో చక్కగా ఇమిడిపోతారు ప్రకాష్‌రాజ్‌. విలన్ గా అలరించారు. సహాయ పాత్రల్లోనూ మెప్పించారు. త్వరలోనే ఆయన తెరపై రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రకాష్‌రాజ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆ విషయాన్ని ప్రకాష్‌రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

మహేష్‌బాబు నటిస్తున్న 'ఆగడు'లో ప్రకాష్‌రాజ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం సాగింది. అది ఒట్టి పుకారేననీ, అందులో నేను కేవలం ఒకేపాత్రలో నటిస్తున్నానని ప్రకాష్‌రాజ్‌ స్పష్టం చేశారు. వి.వి.వినాయక్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో మాత్రం ద్విపాత్రాభినయం చేస్తున్నానని తెలిపారు. ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వం వహిస్తున్న 'ఉలవచారు బిర్యానీ' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ''సినిమాలో అసలు సిసలు మాస్‌ మహేష్‌ని చూస్తారు. దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దారు'' అని నిర్మాతలు తెలిపారు.

మహేష్‌ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

English summary
Prakash Raj tweeted: There is a wrong news around that I'm playing a dual role in mahesh babu s Aagadu . NO... the interesting dual role is in vv vinayak s film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X