twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాష్ రాజ్ న్యూడ్ ఫోజు... ఒంగోలు గిత్త నిర్మాతలు షాక్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఒంగోలు గిత్త' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'A' సర్టిఫికెట్ పొందిన విషయం ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. వాస్తవానికి ఈచిత్రానికి నిర్మాతలు U/A సర్టిఫికెట్ వస్తుందని నిర్మాతలు భావించారు. అయితే పెద్దలు మాత్రమే చూడదగినది అంటూ A సర్టిఫికెట్ ఇవ్వడంతో అంతా షాకయ్యారు.

    ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ న్యూడ్ గా నటించిన సన్నివేశం ఉండటం వల్లనే ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసామనే సమాధానం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి వినిపించినట్లు టాక్. కీలకమైన ఆ సీన్ తొలగింపుకు నిర్మాతలు సాహసం చేయక పోవడంతో 'ఒంగోలు' గిత్త సినిమా కాస్త అడల్ట్ చిత్రం కేటగిరీలో చేరి పోయింది. అయితే ఆ సీన్ బ్లర్ చేసి ఉన్నప్పటికీ సెన్సార్ బోర్డు ఇలాంటి సర్టిఫికెట్ జారీ చేయడంపై దర్శక నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారట.

    A సర్టిఫికెట్‌పై హీరో రామ్ స్పందిస్తూ..... సినిమాలో ఆ సీన్ అంత అభ్యంతరకర సన్నివేశం ఏమీ కాదని, ఇబ్బంది పెట్టే సీన్లు సినిమాలో ఏమీ లేవని తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. నిర్మాత నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈచిత్రం ఫిబ్రవరి 1న గ్రాండ్ గా విడుదలవుతోంది.

    రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

    English summary
    Director Bhaskar's latest venture Ongole Gitta, starring Ram Pothineni and Kriti Kharbanda in the lead has received 'A' certificate from the Regional Censor Board. The producers, who were expecting to get a U/A certificate, were shocked to know about the Censors' decision. Sources from the Board say that the movie has got this certificate due to Prakash Raj's nude appearance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X