twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్లలను బలిచేస్తారా? సిగ్గులేదా మీకు.. మీరు ఉగ్రవాదులే.. ప్రకాశ్ రాజ్, ఫర్హాన్ ఫైర్

    By Rajababu
    |

    పద్మావతి చిత్ర విడుదలను అడ్డుకోవడానికి నిరసనకారులు ఢిల్లీకి సమీపంలో ఓ స్కూల్ బస్సుపై దాడి చేయడంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పౌరులు ఇలాంటి దాడులకు పాల్పడటం సబబా అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే...

    Recommended Video

    Padmaavat Movie Review : పద్మావత్ సినిమా ఏలా ఉందంటే ?
     స్కూల్ బస్సులపై దాడి

    స్కూల్ బస్సులపై దాడి

    పద్మావత్ చిత్ర రిలీజ్ నేపథ్యంలో ఢిల్లీలోని గురుగ్రామ్‌లో నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. బుధవారం రెండు స్కూల్ బస్సులను టార్గెట్‌గా చేసుకొని దాడులు చేశారు. ఈ ఘటనలో స్కూల్ పిల్లలు వెంట్రుక వాసి భారీ ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు. ఈ ఘటనపై ప్రకాశ్ రాజ్, ఫర్హాన్ అఖ్తర్, హన్సల్ మెహతా స్పందించారు.

    పిల్లల్ని బలి చేస్తారా?

    ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం స్కూల్ పిల్లలను బలిచేస్తారా? పిల్లల భద్రతను పట్టించుకోకుండా అలా దాడులు చేయడానికి సిగ్గులేదా అని అధికార, ప్రతిపక్ష పార్టీలపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.

    కర్ణిసేన దాడులతో

    కర్ణిసేన దాడులతో దేశపు భావి భారతపౌరులు భీతిల్లిపోయారు. భయంతో ఏడుస్తూ చిగురుటాకులా వణికిపోయారు. కేంద్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీలు కర్ర విరుగని రీతిలో డిప్లోమాటిక్‌గా వ్యవహరిస్తున్నాయి. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెడుతారా అని ప్రకాష్ రాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    వారు ఉగ్రవాదులే

    స్కూల్ బస్సుపై దాడి చేయడం ఆందోళన అనిపించుకోదు. అది ఉగ్రవాదం అనిపిస్తున్నది. పిల్లలపై దాడి చేసిన వారు నా దృష్టిలో ఉగ్రవాదుల్లాంటి వారు. మీరు కూడా వారిని అలానే పిలువండి అని నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

    దాడులు సరైనవి కావు

    ఓ పక్క సినిమా ఓ వంశ ఔనత్యాన్ని చాటుతున్నది. మరోపక్క సినిమా నిర్వాహకులు రాజపుత్రుల వీరత్వం, ప్రతిష్ఠ గురించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజపుత్రుల అనుకునేవారు పిల్లలపై దాడి చేస్తున్నారు. ఇది సరైనాదేనా అని హన్సల్ మెహతా నిలదీశారు.

     సమాచారం లేకుండా దాడులు

    సమాచారం లేకుండా దాడులు

    పద్మావతి రిలీజ్ నేపథ్యంలో కర్ణిసేన కార్యకర్తలుగా భావిస్తున్న నిరసనకారులు దాడి చేసే సమయంలో టీచర్లు, బస్సు డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. దాడి చేస్తుండగా బస్సు ఫ్లోర్ మీద పడుకోవాలని సూచించడంతో పిల్లలకు హానీ జరుగలేదు. బస్సు అద్దాలు మాత్రమే పగిలిపోయాయి అని బాధితులు చెప్పారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నిరసనకారులు దాడి చేయడం చాలా దారుణం అని బాధితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Prakash Raj said that Aren’t you ashamed to trade our kids’ safety for vote bank politics and tweeted, “Children of my country shiver with fear and cry....as karni Sena attacks a school bus....The elected Government looks the other way..The opposition party diplomatically reacts...aren’t u all ashamed to trade our children’s safety ..for ur vote bank politics..#justasking.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X