ప్రకాష్ రాజ్ రెండో పెళ్లికి శ్రీదేవి భర్త ఏర్పాట్లు
ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారికి గత నవంబర్‌లో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆగస్టు 24వ తేదీన ప్రకాష్ రాజ్ పెళ్లాడనున్నారు. ముంబైలో ఈ వివాహం జరగనుంది. శ్రీదేవి భర్త బోనీకపూర్ వీరి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఆయన రెండో పెళ్లికి శ్రీదేవి భర్త...బాలీవుడ్ నిర్మాత అయిన బోనీకపూర్ ముంబైలో ఏర్పాట్లు చేస్తున్నారు. బోనీకపూర్ నిర్మించిన 'వాంటెడ్' చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఆ సినిమాకు బోనీవర్మ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతోంది. అందులోనూ బోనీకపూర్ కీ రెండో వివాహమే అచ్చి వచ్చింది. అందుకేనేమో దగ్గరుండి ప్రకాష్ రాజ్ రెండో పెళ్ళి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











