30 తీయడానికైనా సిద్ధమే!!!
మోసర్ బేయర్ తో జట్టు కట్టిన ప్రకాష్ రాజ్ సంస్థ డ్యూయెట్ ఫిల్మ్స్ ప్రస్తుతానికి మూడు సినిమాలు నిర్మించే ప్రయత్నంలో పడింది. అంతే కాదు చక్కని స్క్రిప్ట్ లు దొరికితే 30 సినిమాలు తీయడానికైనా తమ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ప్రకాష్ రాజ్ అంటున్నాడు.
ఇకపోతే తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన సినిమా హ్యాపీడేస్ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి హక్కులు పొందిన ప్రకాష్ రాజ్ త్వరలో ఆ సినిమా నిర్మాణాన్ని మొదలెట్టనున్నారు. తెలుగు హ్యాపీడేస్ లో చేసిన తమన్నా తదితర హీరోయిన్లు తమిళ హ్యాపీడేస్ లో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. జల్సా సినిమాకు కెమరామెన్ గా పనిచేస్తున్న కెవి గుహన్ దర్శకత్వం వహించనున్నాడు.


Click it and Unblock the Notifications











