twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నిర్మాతలు మాఫియా: ప్రకాష్ రాజ్ సంచనల వ్యాఖ్య

    By Bojja Kumar
    |

    Prakash Raj
    బెంగుళూరు: తన యాక్టింగ్ టాలెంటుతో తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ ఇలా బాహుబాషా నటుడుగా ఎదిగిన ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన అనేక సినిమాలు ఒక బాష నుండి మరొక బాషలోకి డబ్బింగ్ కావడం షరా మామూలే.

    అయితే తన సొంత గడ్డ కర్నాటక(కన్నడ చిత్రసీమ)లో మాత్రం ఆయన ఈ డబ్బింగ్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కన్నడలో డబ్బింగ్ సంస్కృతిని విస్తరింప చేయాలని చూస్తున్న కొందరి ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు. డబ్బింగ్ సంస్కృతి కన్నడ చిత్రసీమలో ప్రవేశించడం ద్వారా ఇక్కడి కళాకారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.

    మైసూరులో జరిగిన పబ్లిక్ ఈవెంటులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ....డబ్బింగ్ అనేది ఒక భూతం లాంటిది. ఇప్పటికే చాలా చిత్రసీమల్లో ఈ భూతం విస్తరించింది. కొంత మంది నిర్మాతలు ఒక మాఫియాగా ఏర్పడి ఈ డబ్బింగ్ దందా నిర్వహిస్తున్నారు. కన్నడ చిత్ర సీమలో ఇప్పటి వరకు డబ్బింగ్ సంస్కృతి లేదని ఎంతో సంతోషంగా ఉండేవాన్ని. కన్నడ సినీ దిగ్గటజం డాక్టర్ రాజ్ కుమార్ ముందు చూపుతో డబ్బింగ్ సినిమాల మాఫియాను ఇటు వైపు రాకుండా చేసారు.

    కానీ ఇపుడు కొందరు ఆయన ఆశయాలను తుంగలో తొక్కి...కన్నడ చిత్ర సీమలో డబ్బింగ్ సినిమాల జోరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కన్నడ చిత్రసీమకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. రాజ్ కుమార్ గారు బ్రతికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. డబ్బింగ్ సినిమాల రాకతో ఇక్కడ సినిమాలకు ఆదరణ తగ్గే అవకాశం ఉంది. ఇక్కడి కళాకారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

    English summary
    Multilingual actor Prakash Raj, who came to limelight with Kannada movies in the initial stage of his career, has raised his voice against the dubbing culture. The actor has expressed his anger on the people, who are desperately waiting to start dubbing culture in Kannada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X