రాహుల్‌కు ప్రకాష్ రాజ్ సపోర్ట్ : చంపేస్తారా ఏంటి? అంటూ సెన్సేషనల్ కామెంట్స్

ప్రకాష్ రాజ్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు, తెలుగు ప్రజలెవరూ ఉండరు. ఈ మధ్య సినిమాల్లో తక్కువగా కనిపిస్తూ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. రాజకీయ ఉపన్యాసాలిస్తూ, రాజకీయ నేతలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాడు. ఆయన చేసే కామెంట్స్, లేవనెత్తే ప్రశ్నలు అందరిలోనూ ఆలోచనను రేకెత్తిస్తాయి. ప్రభుత్వాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ధైర్యంగా మాట్లాడే ప్రకాష్ రాజ్.. పబ్‌లో రాహుల్‌పై జరిగిన దాడిని ఖండించాడు. ఈ ఘటనపై ఆయన ఏమన్నారో ఓ సారి చూద్దాం.

Recommended Video

Prakash Raj Meets TRS Leader Vinay Bhaskar Over Rahul Sipligunj's Issue | Oneindia Telugu
రాహుల్‌పై దాడి..

రాహుల్‌పై దాడి..

గత వారం పబ్‌లో రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోదరుడు తనపై దాడి చేసినట్టుగా రాహుల్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎవ్వరినీ వదలనని, న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటానని మీడియా ముఖంగా రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నో కాంప్రమైజ్..

ఎట్టి పరిస్థితుల్లోనూ నో కాంప్రమైజ్..

ఈ ఘటనపై రాజకీయ ప్రభావం ఉంటుందని..ఆ విషయం తనకు తెలుసని రాహుల్ చెప్పుకొచ్చాడు. తప్పు చేస్తే భయపడతాం కానీ ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని, అధికారం అండతో రెచ్చి పోయే ఇలాంటి వారిని కట్టడి చేయాలని కేటీఆర్‌కు చేరేట్టుగా రాహుల్ ట్వీట్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్‌కు మాత్రం ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

రంగమార్తాండ డబ్బింగ్ పనుల్లో..

రంగమార్తాండ డబ్బింగ్ పనుల్లో..

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్, రాహుల్, అలీ రెజా, రమ్యకృష్ణ, శివాత్మిక వంటి వారు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డబ్బింగ్ పనుల్లో భాగంగా వచ్చిన ప్రకాశ్ రాజ్ రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు.

 చంపేస్తారా ఏంటి?

చంపేస్తారా ఏంటి?

రాహుల్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ.. పబ్‌కు వెళ్లొద్దని ఎవ్వరూ చెప్పరని, అయితే అలా దాడి చేయడం మాత్రం తప్పని చెప్పుకొచ్చాడు. అలా బీర్ బాటిల్‌తో కొట్టడం ఏంటి..చంపేస్తారా? అంటూ మండి పడ్డాడు. రాహుల్‌కు ఎవ్వరూ లేరనుకున్నారా? తానున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టననని, కమీషనర్‌తో కూడా మాట్లాడతానని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X