Rahul Gandhi పై అనర్హత వేటా? సిగ్గుచేటు..వల్గర్.. ప్రకాశ్ రాజ్ ధ్వజం
మోదీ ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం లేపాయి. రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు వెల్లడించిన సంచలనం రేపింది. మోదీ ఇంటిపేరు ఉన్న వర్గాలను మనోభావాలు దెబ్బ తీసిందని, దాంతో రాహుల్‌కు జైలుశిక్ష విధించింది.
అయితే నేరపూరిత చరిత్ర ఉన్నారనే ఆరోపణలతో పార్లమెంట్ రాహుల్‌పై అనర్హత వేటు విధించింది. రాహుల్‌పై అనర్హత వేటు చేయడంపై దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అంటూ ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి నేతలు తీవ్రంగా ఖండించారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై ఘాటుగా స్పందించారు. ట్విట్టర్‌లో పార్లమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని ట్వీట్ చేశారు. ప్రియమైన పౌరులారా.. ఇలాంటి రాజకీయాలను తలచుకొంటేనే సిగ్గు చేటుగా ఉంది. రాజకీయ వ్యవస్థ మొత్తం తిరోగమనం చెందుతున్నట్టు అనిపించింది.
ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు చాలా వల్గర్. ఇలాంటి దారుణాలపై ప్రజలు మౌనం వహిస్తే.. ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురువుతుంది. కాబట్టి ప్రజలంతా గొంతెత్తి నిరసన తెలియజేయాల్సిన సమయం వచ్చింది అని ప్రకాశ్ రాజ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











