ప్రకాష్ రాజ్ ‘ఉప్పు.. కారం’
తన టాలెంట్‌తో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రకాష్ రాజ్..దర్శకత్వ శాఖలోనూ తన ప్రతిభ నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికే తమిళంలో 'నేను నాన్న కన్నసు' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన, తాజాగా ధోనీ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
లేటెస్ట్‌గా అందిన సమాచారం ప్రకారం ప్రకాష్ మరో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. మళయాళంలో సూపర్ హిట్టయిన సాల్ట్ అండ్ పెప్పర్ (తెలుగులో చెప్పాలంటే ఉప్పు...కారం) అనే సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, తమిళంలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. దీనికి తనే దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల కేరళ ఫిల్మ్ పెస్టివల్‌కు వెళ్లిన ప్రకాష్ రాజ్...అక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ సినిమాను చూశాడు. వెంటనే ఆ సినిమాను ఇతర బాషల్లో రీమేక్ చేయడానికి నిర్ణయించుకుని సదరు నిర్మాతను కలిసి రీమేక్ హక్కులను దక్కించుకున్నాడట.


Click it and Unblock the Notifications











