ఆమె విషయంలో ప్రకాష్ రాజుపై అనుమానం
త్రిష ప్లేసులోకి దివ్య స్పందన ను హీరోయిన్ గా తీసుకుని ప్రకాష్ రాజ్ ఆకాశమంతా కన్నడ రీమేక్ ని డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కన్నడ టైటిల్ నాను నాన్న కనసు.ఇక తమిళంలో ఈ చిత్రాన్ని రాధామోహన్ అభినయ నానుమ్ పేరుతో డైరక్ట్ చేసాడు. తల్లి కూతుళ్ళ అనుబంధం చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు,ప్రకాష్ రాజుతో కలసి తెలుగులోకి అనువదించి విడుదలచేసాడు. కానీ తెలుగులో ఈ చిత్రం చెప్పుకున్నంత గొప్పగా వర్కవుట్ కాలే్దు. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంలో దివ్య స్పందన కనపించలేదు. ఆమె బదులుగా అమూల్య ఆనే ఆర్టిస్టు కనపడింది. దాంతో ఎంక్వైరీలు చేసిన వారికి నిర్మాతలకూ,దివ్య స్పందనకూ పడలేదని తెలిసింది. డబ్బులు మ్యాటర్ లో తేడాలు వచ్చినట్లు తెలిసింది. అయితే అందరూ ప్రకాష్ రాజు కి అందరికీ తగువు పెట్టుకునే గుణం ఉందని అతన్నే అనుమానంతో చూస్తున్నారుట. అక్కడ పత్రికలు కూడా అదే విషయాన్ని రాస్తున్నాయి.


Click it and Unblock the Notifications











