పన్నులు కడుతున్నాం, మాకు రక్షణలేదా?: ప్రకాశ్ రాజ్

సినీ పరిశ్రమలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి అశోక్ కుమార్ ఆత్మహత్యే ఉదాహరణ అని.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని..

Recommended Video

పన్నులు కడుతున్నాం కదా.. రక్షణ ఏది ?

ప్రకాష్‌రాజ్‌ ఈ విషయమై ఇప్పటిదాకా పెదవి విప్పడంలేదు. 'నేను ఓ భారతీయుడ్ని.. నా దేశంలోని ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంభిస్తున్నప్పుడు పౌరుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది. నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని కాదు, భారత ప్రధాని. ఆయన నిర్ణయాలు తప్పయితే, వాటిని ప్రశ్నించి తీరతాను..' అంటూ మొన్నామధ్య బెంగళూరులో జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యానంతరం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించి వార్తల్లోకెక్కారు ప్రకాష్‌రాజ్‌.

జస్ట్‌ ఆస్కింగ్‌

జస్ట్‌ ఆస్కింగ్‌

అప్పటినుంచీ, బీజేపీకీ - ప్రకాష్‌రాజ్‌కీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో కొన్నాళ్ళు ఈ వ్యవహారం సద్దుమణిగినా, ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా "జస్ట్‌ ఆస్కింగ్‌" అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించడంతో వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యతో పాటు అనేక అంశాలపై ఆయన నిరసన స్వరం వినిపించారు.

 తీవ్రంగా స్పందించారు

తీవ్రంగా స్పందించారు

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గట్టిగా మాట్లాడారు. ఇటీవలే ‘పద్మావతి' సినిమా విషయంలో నడుస్తున్న నిరసనలు.. ప్రభుత్వ మౌనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాజాగా ఆయన తమిళ నిర్మాత అశోక్ కుమార్ ఆత్మహత్యపై మాట్లాడారు. సినీ పరిశ్రమలో అంతర్గతంగా ఎలాంటి సమస్యలుంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ అని అన్నారు.

రక్షణ లేకుండా పోయింది

సినీ పరిశ్రమ చాలా గ్లామరస్ గా కనిపిస్తుందని.. కానీ ఇక్కడి వాళ్లకు అసలేమాత్రం రక్షణ అన్నది లేకుండా పోయిందని ప్రకాష్ రాజ్ అన్నాడు. తాము ప్రభుత్వానికి భారీగా పన్నులు కడతామని.. అయినప్పటికీ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతూ లేదని ఆయన అభిప్రాయపడ్డాడు.

అశోక్ కుమార్ ఆత్మహత్యే ఉదాహరణ

అశోక్ కుమార్ ఆత్మహత్యే ఉదాహరణ

సినీ పరిశ్రమలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి అశోక్ కుమార్ ఆత్మహత్యే ఉదాహరణ అని.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని.. కానీ అవి వెలుగులోకి రాలేదని ప్రకాష్ రాజ్ అన్నాడు. ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని ఆయన అభ్యర్థించాడు. సినీ పరిశ్రమకు సంబంధించిన జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం ఏమీ స్పందించకుండా మౌనంగా ఉండటం దారుణమని ప్రకాష్ రాజ్ అన్నాడు.

రాజకీయాల్లోకి

రాజకీయాల్లోకి

ఆ మధ్య సినీ నటుడు కమల్‌హాసన్‌ కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని, కేంద్రం పలు సందర్భాల్లో అనుసరించిన వైఖరిని ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని ప్రకటించేశాడు. మరి, ప్రకాష్‌రాజ్‌ కూడా అదే బాటలో నడుస్తాడా.? అన్న అనుమానము చాలామందికే వచ్చింది అయితే తాను రాజకీయాల్లోకి రావటం లేదని స్పష్టం చేశాడు ప్రకాశ్ రాజ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X