ప్రకాష్ రాజ్ కుమార్తె పాట పాడుతూ ఇలా...(వీడియో)
హైదరాబాద్ : ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రకాష్ రాజ్ కుమార్తె పూజ కు తండ్రి పోలికలే వచ్చనట్లు ఉన్నాయి. తండ్రి తరహాలోనే టాలెంట్ తో ప్రపంచాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె తనలోని సింగింగ్ ట్యాలెంట్ ను ప్రదర్శిస్తూ తన స్నేహితుడుతో కలిసి ఓ వీడియో చేసింది. 'Death Cab for Cutie' - "I Will Follow You into the Dark" అంటూ ఆ పాట సాగుతుంది. ఆ వీడియోని ఆనందంతో ఆయన స్వయంగా షేర్ చేసారు. ఆ వీడియోని మీరూ చూసి క్రింద కామెంట్ లతో ఆమె ప్రతిభను ప్రశంసించండి.
ఈ విషయమై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ..." నా ముద్దుల కూతురు తన ప్రెండ్ తో కలిసి ఓ పాట పాడింది. తండ్రిగా నేను గర్వించే క్షణాలు ఇవి... దాన్ని మీకు షేర్ చేస్తున్నా...ఛీర్స్ !" అన్నారు.

ప్రకాష్ రాజ్ కు ఓ టీనేజ్ కుమార్తె ఉందని ఆమెను చాలా గారంగా చూస్తాడనే విషయం చాలా మందికి తెలియదు. ప్రకాష్ రాజ్ కు, లలిత కుమారి కు పుట్టిన పూజ మంచి టాలెంటెడ్. ఇక 2009 లో లలితా కుమారి కి విడాకులు ఇచ్చి పోనీ వర్మను వివాహం చేసుకున్నారు.
తన భార్యతో అనుబంధం తెగిపోయినా తన ఇద్దరు కుమార్తెలతో ఆయన బంధం కొనసాగుతూనే ఉంది. మేఘన(పెద్ద అమ్మాయి) పూజ(చిన్న అమ్మాయి). ఇద్దరు అమ్మాయిలకు ఆర్టిస్టిక్ ట్యాలెంట్ ఉందని తెలుస్తోంది. తండ్రి లాగే కూతుళ్లు కూడా మంచి ప్రతిభ ఉన్నవాళ్ళు. మరి వాళ్లని సినిమా పరిశ్రమకు తీసుకుని వస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











