ప్రకాష్ రాజ్ డైరక్ట్ చేస్తున్న'ధోని' కథేంటి?

By Srikanya

నటుడు ప్రకాశ్‌రాజ్ డ్యూయెట్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ధోని'. ఈ చిత్రంలో పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌..కార్తిక్ గా ప్రధాన పాత్రను పోషించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం స్టోరీ లైన్ ..కార్తీక్‌ తొమ్మిదో తరగతి విద్యార్థి. పన్నెండో ఎక్కాం రాదు. కానీ ధోని సగటు ఎంతో కచ్చితంగా చెప్పేస్తాడు. దూరం, కాలం ఇలాంటి లెక్కలు రావు. కానీ ఇషాంత్‌ శర్మ విసిరిన బంతి ఎన్ని మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందో చెప్పగలడు. బంతి బరువెంత? బ్యాటు పరిమాణం ఎంత? ఇవన్నీ సరిగ్గా తూకమేసినట్టు వల్లిస్తాడు. మొత్తమ్మీద పుస్తకాల మీదకంటే... మైదానంలో క్రికెట్‌ ఆటపైనే ఆసక్తి. ఈ ప్రేమను కార్తీక్‌ నాన్న సుబ్రహ్మణ్యం అర్థం చేసుకొన్నాడా? కార్తీక్‌ 'ధోని'లా ఎదిగాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ‌.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్...పొద్దున గవర్నమెంట్ ఆఫీస్‌లో గుమస్తాగిరి, సాయంత్రం పచ్చళ్ల వ్యాపారంతో పైసా పైసా కూడబెడుతూ బడ్జెట్ ప్రకారం జీవితాన్ని గడిపే వ్యక్తిగా నటిస్తున్నా. రోజంతా తన ఇద్దరు పిల్లల భవిష్యత్ గురించి కలలు కంటూ ఉండే పాత్ర. కొడుకు కార్తీక్ (ఆకాశ్)ని ఎంబీఏ చదివించాలన్నది అతని జీవితంలో మిగిలిన ఒకే ఒక్క కల. కానీ కార్తీక్‌కి చదువు కంటే ఆటలపై ఎక్కువ మక్కువ. క్రికెట్ అంటే మరీ. లెక్కల్లో సున్నా వచ్చినా, మైదానంలో దిగితే సిక్స్ కొట్టగలడు. కార్తీక్ తండ్రి మాటవిని బాగా చదువుకున్నాడా? లేక 'ధోని'లా మారాడా? అన్నది కథాంశం.

ఇక ఈ నెలలో పాటల్ని, ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేస్తారు. ఇక చిత్రం గురించి ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ''తరగతి గదిలో తెచ్చుకొన్న మార్కులను బట్టి పిల్లల ప్రతిభ అంచనా వేయకూడదు. వారి కలల్ని, కోరికల్ని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి. డాక్టరుగా, ఇంజినీర్‌గా తీర్చిదిద్దాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఆ ఒత్తిడితో పసి మొగ్గల్ని చిదిమేయకూడదని చెప్పే ప్రయత్నమే మా చిత్రం'' అన్నారు. ఈ చిత్రంలో రాధిక ఆప్టే, తనికెళ్ల భరణి, నాజర్‌, మురళిశర్మ, ఆనంద్‌, హేమ, శ్రీతేజ, మెల్కోటే తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, పాటలు: సీతారామశాస్త్రి, సంగీతం: ఇళయరాజా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X