For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'షమితాబ్‌' పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్

  By Srikanya
  |

  హైదరాబాద్: అమితాబ్‌, ధనుష్‌ కలయికలో 'షమితాబ్‌' మొదలైనప్పటి నుంచి ఆ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల క్రితం ట్రైలర్‌ విడుదలయ్యాక అది మరింత పెరిగింది. ఎన్నో అంచనాలతో ఈ శుక్రవారం విడుదలైంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో ధనుష్, అమితాబ్ పోటా పోటీగ నటించారు. ముఖ్యంగా ధనుష్ నటనకు బాలీవుడ్ సలామ్ చేసింది. అయితే సినిమాకు ఉన్న యాంటి క్లైమాక్స్ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో మరో ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని చూసి కామెంట్ చేయటం జరిగింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
  ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ... "షమితాబ్ . వర్కవుట్ కానీ ఓ బ్రిలియెంట్ ఐడియా..అయితే అలాగని ఈ టీమ్ ఫ్యాషన్ ని, స్పిరిట్ ని, కమిటిమెంట్ ని తీసి పారేయలేం... ఇలాంటి ఎటెమ్ట్ చేసినందుకు టీమ్ కు హాట్సాఫ్... లవ్ యు ఆల్...రెస్పెక్ట్ " అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాని అమితాబ్ బచ్చన్ కోసం, ధనుష్, అక్షర, పి సి శ్రీరామ్, ఇళయరాజా కోసం ఓ సారి చూడవచ్చు అని చెప్పారు. ఇక ఇప్పటికి మొదటి రోజులు ఎనిమిధి కోట్లు మాత్రమే వసూలు చేసింది. టోటల్ రన్ ...50 కోట్లు లోపే ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.

  Prakash Raj's sensational comments on Shamitabh

  ఇక 'షమితాబ్‌' చిత్రంలో ఉన్న విశేషాలేంటో చూద్దాం.

  * 'చీనీకమ్‌', 'పా' లాంటి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్‌.బాల్కి దర్శకత్వంలో అమితాబ్‌ నటించిన మూడో చిత్రం షమితాబ్‌.

  * షమితాబ్‌ టైటిల్‌ వెనుక ఆసక్తికరమైన విషయం ఒకటుంది. మొదట ఈ చిత్రాన్ని అమితాబ్‌, షారుఖ్‌తో రూపొందించాలనుకున్నారట. అందుకే ఇద్దరి పేర్లు కలిసేలా షమితాబ్‌ అని పెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల షారుఖ్‌ స్థానంలో ధనుష్‌ వచ్చారు. ధనుష్‌ పేరులో కూడా 'ష్‌' అక్షరం ఉండటంతో అదే పేరు కొనసాగించారు.

  * ఇందులో అమితాబ్‌, ధనుష్‌ల పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. స్టార్‌ హీరో కావాలని కలలు కనే మూగ, చెవిటి జూనియర్‌ ఆర్టిస్ట్‌గా ధనుష్‌ నటిస్తున్నారు. ధనుష్‌ పాత్రకు అమితాబ్‌ గొంతు అరువివ్వడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

  * ఈ సినిమాలో మాసిన గెడ్డంతో మురికి సూట్‌ వేసుకొని అమితాబ్‌ విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులు అమితాబ్‌ అదే అవతారంలో ఉన్నారు.

  * అమితాబ్‌ ఈ చిత్రం కోసం 'పిడ్లీ సీ బాతే' అంటూ సాగే ఓ పాట కూడా పాడారు. టాయిలెట్‌లో కూర్చొని అమితాబ్‌ ఆ పాట పాడటం ట్రైలర్‌లో చూసి ప్రేక్షకులు థ్రిల్‌కు గురయ్యారు.

  * కమల్‌ హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌ ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతోంది. అంతేకాదండోయ్‌.. ఈ సినిమాలో ఓ పాట కోసం తనే కొరియోగ్రఫీ కూడా చేసుకొంది.

  * మేస్ట్రో ఇళయరాజాకు ఇది 999వ సినిమా. ఇందులో 'స్టీరియో ఫోనిక్‌ సొనాటా' అంటూ సాగే గీతాన్ని గతంలో తాను రజనీకాంత్‌ చిత్రానికి స్వరపరచిన ఓ సూపర్‌ హిట్‌ పాట ఆధారంగా రూపొందించారు ఇళయరాజా. ఈ పాటను ఇప్పుడు శృతిహాసన్‌ పాడటం విశేషం.

  * 'షమితాబ్‌' చిత్ర కథ అందులో నటించే వారినే కాదు పరిశ్రమ ప్రముఖులనూ ఆకట్టుకుంది. అందుకే అమితాబ్‌, ధనుష్‌, బాల్కిలతో పాటు అభిషేక్‌ బచ్చన్‌, సునిల్‌ లుల్లా, రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆర్‌కే దమని, సునిల్‌ మన్‌చందా.. ఇలా ఎనిమిది మంది ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు.

  * అమితాబ్‌, ధనుష్‌ల జోడీతో పాటు 10 మంది ప్రముఖ దర్శక నిర్మాతలు ఇందులో అతిథి పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నారు. రోహిత్‌శెట్టి, కరణ్‌ జోహార్‌, మహేష్‌భట్‌, అనురాగ్‌ బసు, రాకేష్‌ ఓంప్రకాష్‌మెహ్రా, రాజ్‌కుమార్‌ హిరాణీ, జావేద్‌ అఖ్తర్‌, బోనీ కపూర్‌, ఏక్తాకపూర్‌, గౌరీ షిండే ఈ చిత్రంలో తళుక్కున మెరిసారు.

  English summary
  Prakash Raj's take on Amitabh, Dhanush and Akshara starrer 'Shamitabh': "SHAMITHABH. a brilliant idea that didn't work. But can't take away the passion n commitment of the whole team.. Hats off for the attempt. Loved u all. Respect"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X