లేటు వయస్సు లవ్ స్టోరీ ('ఉలవచారు బిర్యాని' ప్రివ్యూ)
హైదరాబాద్: నటుడుగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రకాష్ రాజ్ ...డైరక్టర్ గానూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ఈ చిత్రం. మళయాళంలో విజయవంతమైన సాల్ట్ అండ్ పెప్పర్ చిత్రానికి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఇళయరాజా సంగీతం సినిమాకి బాగా ప్లస్ అవుతుందంటున్నారు.
ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. స్నేహ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించటం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మళయాళంలో విజయవంతమైన చిత్రం కావటంతో ఇక్కడా అదే రేంజిని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అయితే కథ ...ప్రకాష్ రాజ్, స్నేహ ముదురు జంట ప్రేమాయణం చుట్టూ తిరుగుతూండంటం...ఎంత వరకూ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందనేది కొద్ది గంటల్లో తేలనుంది.

ప్రేమంటే మావయ్యకు గిట్టదు. మావయ్యకు సరైన జోడీని చూపించి ప్రేమలో దింపాలన్నది అతని మేనల్లుడి ఆలోచన. మావయ్య ఆలోచనలను మేనల్లుడు మార్చగలిగాడా? మావయ్య ప్రేమలో పడ్డాడా? అనేది తెలియాలంటే 'ఉలవచారు బిర్యాని' చూడాల్సిందే. ఈ చిత్రంలో 45 సంవత్సరాల బ్యాచిలర్ కాళిదాసు గా ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. తిండి పిచ్చి ఉన్న ఆయన తన మేనల్లుడు నవీన్(తేజస్) వల్ల గౌరి(స్నేహ)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఈ జంట ఎలా ఏకమయ్యారనేది భావోద్వేగ ప్రధానమైన కథనం.
తేజస్ మాట్లాడుతూ ''తొలి చిత్రంతోనే మూడు భాషల్లో హీరోగా పరిచయమయ్యే అదృష్టం నాకు దక్కింది. కె.ఎస్.రామారావుగారు, ప్రకాష్‌రాజ్‌గారు లేకపోతే నాకీ అవకాశం వచ్చుండేది కాదు. కన్నడ, తమిళంలో ప్రత్యేక ప్రదర్శనలకు మంచి స్పందన వస్తోంది. తెలుగులోనూ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ''అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ప్రేమకథా చిత్రమిది. ప్రకాష్‌రాజ్ తన అద్భుత నటన, దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల్ని అలరిస్తారు. స్నేహ, తేజస్, సంయుక్త సినిమాకు ప్రాణం పోశారు. ఇళయరాజా ఇచ్చిన సంగీతం సినిమాకు ఆయువు పట్టుగా నిలస్తుంది'' అన్నారు.
బ్యానర్: ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్
నటీనటులు : ప్రకాష్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త , ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేష్ మన్నన, శివాజీరావు యాదవ్, విజయ్ తదితరులు
సంగీతం: మేస్ట్రో ఇళయరాజా,
కెమెరా: ప్రీతా జయరామన్,
ఆర్ట్: కదిర్,
ఎడిటింగ్: హర్ష,
దర్శకత్వం: ప్రకాష్‌రాజ్.
నిర్మాత : కె.ఎస్.రామారావు
విడుదల తేదీ : 6-6-2014


Click it and Unblock the Notifications











