డబ్బు సంపాదించడం మా ఆయనకు చాలా సులువు.. ప్రకాష్ రాజ్ సతీమణి!

కన్నడ రాజకీయాల్లో సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాట్ టాపిక్ గా మారారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుండడంతో ప్రకాష్ రాజ్ జాతీయ మీడియాలో ప్రధాన అంశంగా మారుతున్నాడు. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం బెంగుళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఆ నియోజకవర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. తాజాగా ప్రకాష్ రాజ్ సతీమణి పోనీ వర్మ తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తన భర్త రాజకీయాల్లోకి వచ్చారని పోనీ వర్మ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. కష్టం విలువ ఆయనకు తెలుసు అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. నటుడిగా డబ్బు సంపాదించడం ఆయనకు చాలా సులువైన పని. సినిమాల్లో నటిస్తూ హాయిగా కుటుంబంతో గడపవచ్చు. కానీ ప్రజల కోసం కొత్త మార్గం ఎంచుకున్నారు అని పోనీ వర్మ తెలిపారు.

Prakash Rajs wife Pony Verma interesting comments on her Husband

ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు. పోనీ వర్మ ఆ గ్రామంలోకి మీడియాని తీసుకుని వెళ్లి తన భర్త చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని వివరించారు. ఆ సందర్భంలో ఆయన తనని కోపగించుకున్నారని పోనీ వర్మ తెలిపారు. ఇక్కడకు మీడియాని ఎందుకు తీసుకుని వచ్చావు.. నేను ఈ పని చేస్తోంది సంతృప్తి కోసం.. చూపించుకోవడానికి కాదు అని తనతో చెప్పినట్లు పోనీ వర్మ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X