ప్రకాష్ రాజ్ రెండో పెళ్ళి కి డేట్,వెన్యూ డిటేల్స్
మొదటినుంచి అనుకుంటున్నట్లుగా ప్రకాష్ రాజు తన రెండో వివాహానికి డేట్ గా ఆగస్టు 24 నే ఫైనల్ చేసుకున్నారు. మొదటి బార్య లలితా కుమారికి విడాకులు ఇచ్చిన ప్రకాష్..బాలీవుడ్ కొరియో గ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకుంటున్నారు. ముంబయి లోని ఆమె స్వగృహంలో ఈ వివాహం జరగనుంది. ఇక పోనీ వర్మ తాజాగా ప్రకాష్ రాజ్ సొంత బ్యానర్ లో రూపొందిన తమిళ చిత్రం పాటలకు కొరియోగ్రఫి అందించింది. అలాగే ఆమె తెలుగులో పూరీ జగన్నాధ్ సినిమాలకూ, హిందీలో ప్రియదర్శన్ సినిమాలకూ ఎక్కవగా ఆమె కొరియోగ్రఫి చేసింది. ఇక ఇక గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఆయన రెండో పెళ్లికి శ్రీదేవి భర్త...బాలీవుడ్ నిర్మాత అయిన బోనీకపూర్ ముంబైలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బోనీకపూర్ నిర్మించిన 'వాంటెడ్' చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఆ సినిమాకు బోనీవర్మ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











