బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్ వ్యాఖ్యలపై.... ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?
దేశంలో, రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు ప్రకాష్ రాజ్. కొన్ని రోజులుగా దేశంల చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తనదైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ప్రకాష్ రాజ్ తెలంగాణ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్నికలపై స్పందించారు.
ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ లాంటి వారు... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతుకోసుకుంటాను అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో ఓ లుక్కేద్దాం...

కొత్త సిస్టం పుడుతుంది
మన రాష్ట్రానికి, దేశానికి కొత్త రాజీయాలు అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మన రాజకీయ నాయకులను చూస్తూనే ఉన్నాం. ఒక సిస్టం ఎప్పుడైనా సరిగా పని చేయకపోతే ఇంకొకటి పుడుతుంది. నేను తెలంగాణ, కర్నాటక, దేశంలోని ఇతర ప్రాంతాలో తిరిగినపుడు ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారని తెలుసుకున్నాను. వాళ్ల సమస్యను వాళ్లే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందే ఆలోచనకు వచ్చారు అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

యువత మార్పు కోరుకుంటోంది
సమస్యలు పునరావృతం అయినపుడు వారు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటారు. రాజకీయాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పని చేయని వారిని ప్రశ్నించాలి, వారిపై ఒత్తిడి పెంచాలి అనే భావన యువతలో పెరుగుతోంది. అందరూ మాటలు చెబుతున్నారు కానీ ఉద్యోగాలు కల్పించడంలో చాలా మంది రాజకీయ నాయకులు ఫెయిల్ అవుతున్నారు. అందుకే యువత మార్పును కోరుకుంటోందని అన్నారు... ప్రకాష్ రాజ్ అన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై...
నేను వీళ్లకు ఓటేయండి, వాళ్లకు ఓటేయండి అని చెప్పడం లేదు. ఆలోచించండి అని మాత్రమే చెప్పాను. కర్నాటకలో ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు కాబట్టి తెలంగాణలో ఎందుకు చేయడం లేదు? అని కొందరు అంటున్నారు. నేను అలా ఎందుకు చేయాలి? ఇక్కడున్న లీడర్లను చూస్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ల మాటలేంటి? బాషఏంటి? అటు కాకుండా... ఇటు కాకుండా ఉన్న వారు టీఆర్ఎస్ పార్టీకి వేయండి అలా మాట్లాడటం టాన్స్ జెండర్ కమ్యూనిటీని కించ పరచడమే కదా? అలాంటి నాయకులు మనకు కావాలా? అంటూ ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

బండ్ల గణేష్ బ్లేడుతో గొంతుకోసుకుంటాననే వ్యాఖ్యలపై
బండ్ల గణేష్ కాంగ్రెస్ అధికారంలోకి రాక పోతే బ్లేడుతో గొంతు కోసుకుంటాను అని వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ.... అలాంటి హ్యూరస్ విషయాలు జరుగుతూ ఉంటాయి. కొందరు అలా మాట్లాడుతూ ఉంటారు. జనాలు చూస్తారు కదా... ఆయన అలా మాట్లాడిన వీడియోకు హయ్యెస్ట్ హిట్స్ ఉంటాయి. అలా అని గొప్పగా మాట్లాడారని కాదు... వాళ్లు దాన్ని కామెడీగా చూస్తారు. ఫైనల్‌గా డిసైడ్ చేసేది ప్రజలే... ప్రకాష్ రాజ్ అన్నారు.


Click it and Unblock the Notifications











