చిరంజీవి, జూ ఎన్టీఆర్, మహేష్ బాబులపై సంచలన వ్యాఖ్యలు..
చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులను చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వస్తుందోంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాక్యలు చేశారు. బుదవారం ఆయన ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, చిరంజీవి హీరోయింజం మార్క్ చిత్రాలకు బాటలు వేస్తే...అందులో జూ ఎన్టీఆర్, మహేష్ బాబులు కూడా కొనసాగిస్తూ..ఆ ట్రెండ్ నుండి బైట పడలేక పోతున్నారని అన్నారు. విభిన్న పాత్రలు, కథాంశాలు చేయాల్సిన వయసున్నా ఆ దిశగా ఆలోచించక పోవటం శోచనీయమన్నారు.
తక్కువ సినిమాలు చేసినా అల్లూ అర్జున్, ప్రభాస్ లు నటులుగా నిరూపించుకుంటున్నారని వ్యాఖ్యలు చేస్తూ ..భారత దేశంలో అత్యధిక సార్లు బ్యాన్ విధించబడిన నటుడిగానూ నాకు గుర్తింపుందని తన మీద తానే సూటైర్లేసుకున్నారు. జపాన్, స్వీడన్, చిత్రాల నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్తూ..తనకి నచ్చిన నటులలో కోటా శ్రీనివాసరావుకే అగ్రతాంబూలమని...ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడాయనని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్.


Click it and Unblock the Notifications











