twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కావేరీ వివాదం: ప్రకాశ్ రాజ్ లా తమిళ హీరోలు ఆలోచించరా..??

    |

    కావేరీ జలాలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కావేరీ పరీవాహక ప్రాంతాల్లోని రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడుకు 10 రోజుల్లో 13 టీఎంసీల కావేరి జలాల్ని విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో కర్ణాటకలో ఉద్రిక్తత నెలకొంది. మైసూరు, హాసన్, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.

    ఈ ప్రాంతాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. అనేక చోట్ల బంద్‌ వాతావరణం నెలకొంది. మండ్య జిల్లాలో లోక్‌సభ మాజీ సభ్యురాలు సినీ నటి రమ్య, విధానసభ సభ్యుడు, నటుడు అంబరీష్‌ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సాగు నీటి మంత్రి పాటిల్‌ నివాసాల ఎదుట ఆందోళనకారులు నిరసన ప్రదర్శనల్ని నిర్వహించారు.

    prakash

    అయితే ఈ విషయంలో తమ రాష్ట్ర ప్రభుత్వానికి తాము కూడా అండగా ఉంటామని ప్రకటిస్తున్నారు తమిళసినీ జనాలు.కావేరి నదీ జలాల హక్కుల పరిరక్షణ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి - అమ్మ జయలలిత తీసుకునే చర్యలకు తాము పూర్తి అండగా ఉంటామని దక్షిణ భారత సినీ నటుల సంఘం ప్రకటించింది. తమిళ హీరో విశాల్.. తమిళ ప్రజల దాహార్తి తీర్చడానికి - రైతులకు వ్యవసాయానికి నీరు అందించడానికి అమ్మ జయలలిత తీవ్రంగా కృషి చేస్తున్నారని ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారని

    ఒక్కసారి సుప్రీం స్పష్టమైన తీర్పును ఇచ్చిన తర్వాత కూడా కర్ణాటకకు చెందిన వారు ఆందోళనకు దిగడం సరైన చర్య కాదనీ చెప్తూ ఈ వ్యవహారంలో కన్నడ నటుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపాడు. ఏది ఏమైనా.. కావేరి జలాల విషయంలో అమ్మ జయలలిత ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తాము పూర్తిగా అండగా ఉంటామని ప్రకటించారు.

    కానీ కన్నడ కర్ణాటక వాడే అయినా దక్షిణాది భాషలన్నిటిలోనూ పాపులర్ అయిన ప్రకాశ్ రాజ్ మాత్రం హుందాగా స్పందించాడు. ఎవరినీ నిందించలేదు, ఏ రాజకీయ కోణం నుంచీ స్పందించలేదు ''కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్నది చూస్తుంటే భాధగా ఉంది. మన హక్కుల కోసం మనం పోరాడాలి, న్యాయం సాదించాలి. కానీ అది బస్సులను తగలబెట్టి, అన్నదమ్ములను కొట్టి కాదు.

    prakash 2

    ఉద్యమం ఎలా చేయాలో మన భవిష్యత్‌ తరాలకు మనమే నేర్పించాలి. మనకు కోర్టులున్నాయి. నాయకులున్నారు. చట్టముంది. మనమంతా మనుషులం. శాంతిగా పోరాడుదాం. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. శాంతిగా ఉండండి. విధ్వసం ఆపండి'' అంటూ పిలుపునిచ్చారు ప్రకాష్‌ రాజ్‌

    English summary
    With the Cauvery issue burning down Karnataka, actor Prakash Raj has posted a video message pleading with protestors to seek justice without violence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X